దేశంలోనే నెంబర్‌వన్‌గా భద్రాద్రి, ఎయిర్‌పోర్ట్, వంతెన నిర్మాణం (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: దేశంలోనే భద్రాచలం ఆలయాన్ని గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.భధ్రాచలానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అభివృద్ది చేయాలని కెసిఆర్ చెప్పారు .

భద్రాచలం ఆలయ అభివృద్ది కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో బుదవారంనాడు హైద్రాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. భద్రాచలం ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

యాదగిరిగుట్ట ఆలయాభివృద్ది విషయమై జీయర్‌స్వామి చేసిన సూచనలకు అనుగుణంగా యాదగిరిగుట్ట ఆలయాభివృద్ది కోసం ప్రభుత్వం చర్యలను తీసుకొంటుంది. అదే సమయంలో భద్రాచలం ఆలయాభివృద్దిపై కూడ ప్రభుత్వం కేంద్రీకరించింది.

భద్రాచలం ఆలయానికి సంబంధించిన డిజైన్లపై ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో చర్చించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకు సూచించారు.

భద్రాచలం ఆలయాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలి

భద్రాచలం ఆలయాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలి

భద్రాచలం ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్తంగా శ్రీరామచంద్రుడిపై ప్రజలకున్న భక్తి ప్రపత్తులను పరిగణనలోకి తీసుకొని భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే ఒక అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. గోదావరి నది భద్రాచలం ఆలయం దగ్గరే మలుపు తిరిగి తూర్పువైపు ప్రవహిస్తున్నదని, కొద్దిదూరం ప్రయాణించి గోదావరి అక్కడ ఉత్తరవాహినిగా ప్రయాణిస్తున్నదని సీఎం గుర్తుచేశారు.

  CM KCR's Grandson Himanshu Presents 'Pattu Vastralu' To Bhadrachalam Temple, Why - Oneindia Telugu
  భద్రాచలానికి ఆధ్యాత్మిక చరిత్ర

  భద్రాచలానికి ఆధ్యాత్మిక చరిత్ర

  శ్రీరాముడు కూడా పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు వచ్చి ఇదే ప్రాంతంలో నడయాడారని సీఎం తెలిపారు. ఈ కారణాలవల్ల భద్రాద్రి ఆలయానికి స్థలపురాణం, స్థలమహాత్మ్యం, పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాధా న్యం ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. కాబట్టి ఖర్చుకు వెనుకాడకుండా భద్రాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యవైభవ క్షేత్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు సిఎం కెసిఆర్

  జీయర్‌స్వామి సూచనల మేరకే డిజైన్లు

  జీయర్‌స్వామి సూచనల మేరకే డిజైన్లు

  చిన జీయర్‌స్వామీజీ సూచనల ప్రకారం ఆలయ శిల్పి ఆనందసాయి బృందం రూపొందించిన దేవాలయ అభివృద్ధి నమూనాలను సీఎం పరిశీలించారు. సీఎం కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. దేవాలయానికి ఉత్తరం, పడమర దిక్కున ఉన్న స్థలాలతో కలిపి 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధిచేయాలని సూచించారు. మూలవిరాట్టు కొలువై ఉన్న గర్భగుడి, చారిత్రాత్మక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంగల కట్టడాలకు ఆటంకం కలుగకుండా నిర్మాణాలను చేపట్టాలని స్పష్టం చేశారు.

  భక్తులకు సకల ఏర్పాట్లు

  భక్తులకు సకల ఏర్పాట్లు

  శ్రీరాముడిని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా పూజిస్తారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో రాముడికి భక్తులు ఉన్నారు. రాముడు అందరి దేవుడు. రాముడు కొలువై ఉన్న భద్రాచలానికి సమీపంలో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు అని సీఎం తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. సీతారామ కల్యాణం సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

  భద్రాచలంలో విమానాశ్రయం

  భద్రాచలంలో విమానాశ్రయం

  భద్రాచలంలో దేవుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కల్పించాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు.గోదావరిలో పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలని అన్నారు. భక్తులు భద్రాచలం రావడానికి అనుగుణంగా రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వం మెరుగు పరుస్తున్నదని సీఎం చెప్పారు. కొత్తగూడెం-భద్రాచలం మధ్య విమానాశ్రయం నిర్మిస్తున్నట్టు కెసిఆర్ చెప్పారు.

  రైలు మార్గం పొడిగింపు

  రైలు మార్గం పొడిగింపు

  కొత్తగూడెం వరకు ఉన్న రైలు మార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించే ప్రతిపాదనలను ఇప్పటికే రైల్వేశాఖకు పంపించినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.

  గోదావరి, ప్రాణహిత నదుల వెంట రహదారిని నిర్మించడం వల్ల మహారాష్ట్ర వరకు రోడ్డు సౌకర్యం కలుగుతుందన్నారు కెసిఆర్. ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను కలిపేలా రహదారులను నిర్మిస్తున్నాం

  గోదావరి నదిపై మరో వంతెన

  గోదావరి నదిపై మరో వంతెన

  గోదావరి నదిపై మరో వంతెన నిర్మిస్తున్నట్టు సిఎం కెసిఆర్ చెప్పారు. గోదావరి నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్ట్‌లు కూడా వస్తున్నాయి. యాత్రికులు పడవ ప్రయాణం కూడా చేసే విధంగా ఏర్పాట్లు ఉంటాయి అని సీఎం సూచించారు.

  ఎన్ని నిధులైనా ఇస్తాం

  ఎన్ని నిధులైనా ఇస్తాం

  భద్రాచలం ఆలయాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు ఖర్చుకు కూడ వెనుకాడబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఎన్ని నిధులైనా ఇ

  స్తామని సమీక్ష సమావేశంలో అధికారులకు చెప్పారు కెసిఆర్. డిజైన్ల ప్రకారంగా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని కెసిఆర్ సూచించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In a bid to turn the Sri Sitaramachandraswamy Temple in Bhadrachalam into one of the best pilgrimage spots in the country, Chief Minister K Chandrashekhar Rao on Wednesday announced plans for the temple’s grand makeover, including an airport between Kothagudem and Bhadrachalam.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X