ట్విస్ట్: లవర్‌ను చంపిన తెల్లారే మరో యువతితో వివాహం, మొదటి భార్యకు విడాకులు
మోత్కూరు: ప్రేమించి యువతిని లోబర్చుకొన్నాడు. అంతేకాదు వివాహం చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో ఆమెను నమ్మించి హత్య చేశాడు. మరునాడే మరో యువతిని వివాహం చేసుకొన్నాడు. అయితే నిందితుడికి అప్పటికే పెళ్ళై భార్యతో దూరంగా ఉంటున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో చోటు చేసుకొంది.
ప్రేమ పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఘటనలు ప్రతి రోజూ ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొలీసులు విచారణ చేస్తే అసలు విషయం వెలుగు చూసింది యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పనిచేసే ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్ లో నరేష్, భార్గవి పనిచేస్తున్నారు. భార్గవి నర్సుగా పనిచేస్తోంది. నరేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ప్రేమించి లోబర్చుకొన్నాడు
యాదాద్రి భువనగరి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని వినాయక ఆసుపత్రిలో నరేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్గవి అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ప్రేమిస్తున్నానని నరేష్ భార్గవిని లోబర్చుకొన్నాడు. కొంత కాలంగా వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగుతోంది. వివాహం చేసుకోవాలని బాధిత యువతి నరేష్‌ను నిలదీసింది. అయితే ఆమెను నమ్మించి పిలిపించి హత్య చేశాడు నరేష్,. భార్గవి మృతదేహన్ని పూడ్చిపెట్టాడు. మార్చి 3న భార్గవిని హత్య చేశాడు

భార్గవిని హత్య చేసి మరునాడే వివాహం
భార్గవిని హత్య చేసిన మరునాడే మరో యువతిని నరేష్ వివాహం చేసుకొన్నాడు. నరేష్‌ను వివాహ విషయమై భార్గవి నిలదీసింది. దీంతో ఆమెను హత్య చేసి తనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నరేష్ చేసుకొన్నాడు. భార్గవిని హత్య చేసిన మరునాడే మరో యువతిని వివాహం చేసుకొన్నాడు. తన పొలం వద్దకు యువతిని తీసుకెళ్ళి బండరాయితో మోదీ చంపేశాడు. బావి వద్దే పూడ్చేశాడు.

మొదటి భార్యతో తెగదెంపులు
నాలుగేళ్ళ క్రితం నరేష్‌కు కీసరకు చెందిన యువతితో వివాహమైంది. అయితే భార్యతో గొడవల కారణంగా ఆమెకు నరేష్ విడాకులిచ్చాడు. ఆత్మకూరులోని ఆసుపత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుజిలాపురం గ్రామానికి చెందిన నరేష్ అక్కడే పనిచేస్తున్నభార్గవితో ప్రేమాయణం సాగించాడు. అయితే భార్గవిని లొంగదీసుకొన్నాడు. అయితే మరో యువతితో నరేష్ వివాహం నిశ్చయమైన విషయం తెలుసుకొని భార్గవి నిలదీసింది. దీంతో ఆమెను మార్చి 3న, చంపేశాడు

భార్గవి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో
మార్చి 3వ తేది నుండి భార్గవి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ నిర్వహించారు. నరేష్‌తో ప్రేమాయణం బయట పడింది. నరేష్‌ను విచారిస్తే భార్గవి హత్య చేసిన విషయం వెలుగు చూసింది.పెళ్ళై రెండో రోజే కొత్త పెళ్ళికొడుకైన నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్గవి మృతదేహన్ని వెలికితీసి పోస్ట్ మార్టానికి పంపారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications