Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భట్టీ ఆమరణ దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం .. నిమ్స్ కు తరలింపు .. భట్టీ దీక్ష కొనసాగింపు

Recommended Video

    భట్టీ ఆమరణ దీక్ష భగ్నం... నిమ్స్ కు తరలింపు || Oneindia Telugu

    టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనాన్నినిరసిస్తూ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయినా ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు . ఇక భట్టీ సైతం దీక్ష భగ్నం చెయ్యాలని టీఆర్ ఎస్ సర్కార్ ఎంత ప్రయత్నం చేసినా దీక్ష కొనసాగిస్తున్నారు.

     సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఆమరణ దీక్షకు దిగిన భట్టీ

    సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఆమరణ దీక్షకు దిగిన భట్టీ

    తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ 36 గంటలపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. భట్టి విక్రమార్క చేపట్టిన దీక్షకు టిడిపి, తెలంగాణ జన సమితి పార్టీలు మద్దతు ప్రకటించాయి. మొదటి 36 గంటలపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టిన బట్టి తిరిగి దానిని ఆమరణ నిరాహార దీక్ష గా మార్చుకున్నారు. బట్టి విక్రమార్క కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు దీక్షలో పాల్గొన్నారు.

    భట్టి ఆరోగ్యం క్షీణిస్తుంది అని దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. నిమ్స్ కు తరలింపు

    భట్టి ఆరోగ్యం క్షీణిస్తుంది అని దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. నిమ్స్ కు తరలింపు

    టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం భట్టి విక్రమార్క దీక్షకు సంఘీభావం ప్రకటించారు.కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ పై దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలను చేశారు. ఇక గత మూడు రోజులుగా దీక్ష చేపట్టిన భట్టీ విక్రమార్క ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో పోలీసులు దీక్షను భగ్నం చేసే యత్నం చేశారు . ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకు దీక్ష భగ్నం చేసిన పోలీసులు భట్టి విక్రమార్క ను ఆస్పత్రికి తరలించారు .వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రికి పంపించారు. అయితే ఆయన ఆస్పత్రిలో సైతం దీక్ష చేస్తున్నారు.

    నేడు భట్టీ దీక్షకు సంఘీభావం ప్రకటించనున్న రాహుల్ గాంధీ , ఏఐ సీసీ నేతలు.. అందుకే దీక్ష భగ్నం చేసే యత్నం

    నేడు భట్టీ దీక్షకు సంఘీభావం ప్రకటించనున్న రాహుల్ గాంధీ , ఏఐ సీసీ నేతలు.. అందుకే దీక్ష భగ్నం చేసే యత్నం

    కాంగ్రెస్ పార్టీ నేతలు బట్టి సాగిస్తున్న ఆమరణ దీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తంగా తీసుకొని వెళ్ళాలని భావించిన నేపథ్యంలో పోలీసులు దీక్ష భగ్నం చేశారు. బట్టి ఆమరణ దీక్షతో రాష్ట్రస్థాయిలో ఆందోళనలు నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని సైతం బట్టి దీక్షకు సంఘీభావం ప్రకటించాలని తెలంగాణ బీసీ నేతలు ఆహ్వానించారు. ఇవాళ రాహుల్ తో పాటు పలువురు ఏఐసిసి నేతలు వచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు భట్టి విక్రమార్క దీక్షను భగ్నం చేశారు. అయినప్పటికీ ఆందోళన కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆస్పత్రిలో సైతం భట్టీ దీక్ష కొనసాగిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+