హైదరాబాద్ నుంచి IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ.. పుణ్యక్షేత్రాలన్నీ ఒకే ట్రిప్ లో..
హైదరాబాద్ నుంచి 10 రోజుల పాటు సూపర్ టూరిస్ట్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఇండియన్ రైల్వేస్. ఈ యాత్ర అక్టోబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్, కాజీపేట మీదుగా ఈ రైలు సాగనుంది. దేశంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన దర్శనీయ ప్రదేశాలను ప్రయాణికులు సులువుగా.. తక్కువ ఖర్చుతో దర్శించుకునేందుకు వీలుగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు భవ్య గుజరాత్ పేరుతో యాత్రను ప్రారంభించనుంది. ఈ నెల 26 నుంచి టూర్ ప్రారంభం కానుంది.
10 రోజుల టూర్ ప్యాకేజీలో భాగంగా తక్కువ ధరకే గుజరాత్ లోని ప్రముఖ దర్శనీయ ప్రాంతాలను చేరుకోవచ్చు. భవ్య గుజరాత్ పేరుతో IRCTC (Indian Railway Catering and Tourism Corporation) ఈ యాత్రను తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా గుజరాత్ లోని ద్వారక, సోమనాథ్, స్టాచూ ఆఫ్ యూనిటీని సందర్శించవచ్చు. ఈ మేరకు అక్టోబర్ 26 నుంచి పుణ్యక్షేత్రాల యాత్రను ప్రారంభిస్తుంది. 9 రాత్రులు/10 రోజులు భారత్ గౌరవ్ ప్రత్యేక రైలులో ఈ దర్శనీయ స్థలాలను సందర్శించుకోవచ్చు.
దర్శనీయ ప్రదేశాలను ఓ సారి పరిశీలిస్తే.. ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర ఆలయం, బేట్ ద్వారకా ఆలయం ఆ తర్వాత.. సోమ్ నాథ్ లోని సోమనాథ్ ఆలయం అలాగే.. అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం ఆ తర్వాత మోడేరా సూర్యదేవాలయం (మోడేరా), రాణి కీ వావ్ (పటాన్) అలాగే ఎక్తా నగర్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించవచ్చు.
ప్యాకేజీ ధరలను ఓసారి పరిశీలిస్తే.. యాత్రికులకు టీ, టిఫిన్, భోజనం, రవాణా, హోటల్ గదులు ఇవన్నీ కలుపుకుని.. IRCTC ఎకానమీ స్లీపర్ క్లాస్ ఒక్కరికి ధర రూ.18,400, స్టాండర్డ్ థర్డ్ ఏసీ రూ.30,200, కంఫోర్ట్ సెకండ్ ఏసీ రూ.39,900 గా ఉంటుంది. ఈ రైలు అక్టోబర్ 26 న మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంటలో బయలుదేరుతుంది.

అక్కడి నుంచి నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్ స్టేషన్స్ లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను 97013 60701, 98810 30711 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications