రేవంత్ రెడ్డి రాజీనామాకు ఏడ్చేసిన నేత: ఊరడించిన చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ టిడిపి నేత భూపాల్ రెడ్డి ఏడ్చేశారు. ఆయనను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఊరడించారు. రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ సమర్పించి వెళ్లిపోయిన తర్వాత టి టిడిపి నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు.

రేవంత్‌రెడ్డి ఒంటరిగా వెళ్లడం బాధించిందని, పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడవంతో ఒత్తిడికి గురై ఏడ్చానని కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటానని, రేవంత్‌రెడ్డి వెళ్లి పోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసుని ఆయన అన్నారు.

ఎన్టీ రామారావును గద్దె దించడానికి సంక్షోభంలో పనిచేసిన నాయకుడే రేవంత్ రెడ్డి వెళ్లిపోవడానికి కారణమని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది టిడిపి నాయకులు వెళ్లిపోతారని ఆయన అన్నారు.

వ్యక్తిగతంగా మాట్లాడుదామని పిలిచి...

వ్యక్తిగతంగా మాట్లాడుదామని పిలిచి...

వ్యక్తిగతంగా మాట్లాడదామని రేవంత్ రెడ్డిని చంద్రబాబు పిలిచారని, ఇక్కడ అవకాశం లభించకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి వద్దని రేవంత్‌ వెళ్లిపోయారని భూపాల్‌రెడ్డి చెప్పారు. పార్టీ మారతానని పత్రికల్లో వచ్చిన వార్తలపై భూపాల్‌రెడ్డి ఆవేదన చెందారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పోరాడా...

కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పోరాడా...

తాను కాంట్రాక్టర్‌గా నష్టపోయానని కంచర్ల భూపాల్ రెడ్డి చెప్పారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి వెళ్లినా పార్టీని వీడలేదని, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పోరాడుతున్నానని ఆయన చంద్రబాబుకు వివరించారు. టీటీడీపీ నేతల్లో కొందరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించారని సమావేశంలో కంచర్ల భూపాల్‌రెడ్డి విలపించారు. దాంతో సమావేశంలో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణంలో వెళ్లింది. ధైర్యంగా ఉండాలని భూపాల్‌రెడ్డి చంద్రబాబు ఊరడించారు.

కొంత మంది సీనియర్లు కలిసి....

కొంత మంది సీనియర్లు కలిసి....

కొంత మంది సీనియర్లు కలిసి రేవంత్ రెడ్డిని పంపించివేశారని కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. తాను కూడా రాజీనామా చేసే విషయంపై ఆలోచిస్తానని చెప్పారు. నియోజకవర్గం ప్రజలతో మాట్లాడి తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.

హైదరాబాదులో 2న సమావేశం

హైదరాబాదులో 2న సమావేశం

నెలలో ఒకరోజు హైదరాబాద్ వచ్చి సమావేశం అవుతానని, వచ్చే నెల2న హైదరాబాద్‌కు వస్తానని చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలకు చెప్పారు. పార్టీ బలోపేతంపై నేతలు దృష్టి పెట్టాలని చంద్రబాబుకు నేతలు సూచించారు. ఆయన నేతలకు ధైర్యవచనాలు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Telugu Desam party leader Bhupal Reddy wept in TDP leaders meeting before Andhra Pradesh CM Nara Chandrababu Naidu at Amaravati

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి