వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువరాజు ఆశ్చర్యం : ''నేను 840 ఏళ్ళ క్రితం ఇక్కడే చదివాను''

840 ఏళ్ళ క్రితమే నాగార్జున సాగర్ లో పుట్టానని భూటాన్ యువరాజు యువరాజు వాంగ్ చుక్ కుమారుడువిరోచిచానా రింపోచే సందర్శించాడు.అయితే గత జన్మలో తాను నడిచిన ప్రదేశాలను ఆయన తన కుటుంబీకులకు చూపాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయపురి సౌత్ : తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున కొండను భూటాన్ దేశ రాజకుటుంబీకులు సందర్శించారు. భూటాన్ యువరాజు వాంగ్ చుక్ విరోచిచానా రింపోచే . నాగార్జునసాగర్ లోనే పుట్టాడని చెబుతున్నాడు. 840 ఏళ్ళ క్రితం ఇక్కడే పుట్టానని తనకు వచ్చిన కలల ఆధారంగానే తాను ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చినట్టు ఆయన చెప్పాడు.

భూటాన్ మహరాజు జింగ్మే కేసర్ నంజల్ వాంగ్ చుక్, రాణి జట్సన్ పీమా వాంగ్ చుక్ కుమారుడే విరోచిచానా రింపోచే.భూటాన్ రాజకుటుంబీకులు ఆదివారం నాడు నాగార్జునకొండను సందర్శించారు సాగర్ లోని పలు ప్రాంతాలను వారు సందర్శించారు. సాగర్ నుండి లాంచీలో కొండకు వెళ్ళారు.

840 ఏళ్ళ క్రితమే ఇక్కడ పుట్టాను
భూటాన్ యువరాజు విరోచినానా రింపోచే 840 ఏళ్ళ క్రితమే ఇక్కడే పుట్టానని చెబుతున్నాడు. బీహర్ లోని నలంద విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించానని చెబుతున్నాడు. అయితే రెండు రోజుల క్రితం అక్కడ పర్యటించిన రాజకుటుంభీకులు నేరుగా సాగర్ కు వచ్చారు. 840 ఏళ్ళ క్రితమే నాగార్జునకొండలో ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయంలో అభ్యసించినట్టు ఆయన చెబుతున్నాడు.

bhutan prince visited nagarjuna hill

నాగార్జున కొండపై గత జన్మలో తాను కూర్చొన్న ప్రదేశాన్ని , కొండపై తిరిగిన ప్రదేశాన్ని యువరాజు తన అమ్మమ్మకు చూపాడు.తనకు కలలో ఐదు తలలో పాము కన్పిస్తోందని, అప్పట్లో ఆ పాము నాగార్జున కొండపై తిరిగేదని భూటాన్ యువరాజు గుర్తుచేసుకొన్నాడు.

నాగార్జున కొండపై ప్రస్తుతం ఉన్న విగ్రహం బుద్దుడి విగ్రహం కాదన్నారు. ఈ విగ్రహం ఓ మాత విగ్రహంగా యువరాజు చెబుతున్నాడు. ఈ విగ్రహం కొంపై కాకుండా నది మద్యలో ఉండేదని ఆయన చెప్పారు.

ప్రతిరోజు సాగర్ లో ఉన్న నాగార్జున కొండకు పడవలో వెళ్ళి వచ్చినట్టుగా కలలు వస్తున్నాయని చెప్పేవాడని రాజకుటుంభీకులు చెప్పారు. తన మనమడు కారణ జన్ముడని , అందుకే తాము సాగర్ ను సందర్శించేందుకు వచ్చినట్టుగా రాజకుటుంభీకులు చెప్పారు.

నాగార్జున కొండపై మ్యూజియం , సింహళ, భౌద్దస్థూపాలు, నమూనాలు. ఆశ్వమేథ యాగశాల, స్నానఘట్టాలను తన అమ్మమ్మతో కలిసి భూటాన్ రాజకుమారుడు సందర్శించాడు. భౌద్దమత గురువు దలైలామ నాటిన బోధి మొక్కకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

English summary
bhutan prince vangmovangcau visited nagarjuna hill Sunday. bhutan prince vangmovangcau born before nagarjuna hills before 840 years. so, royal family visited nagarjuna hills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X