కేసీఆర్ సైలెన్స్ వెనుక బిగ్ ప్లాన్.. కాంగ్రెస్ కు ముందుంది మొసళ్ళ పండుగ!!
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావడం కెసిఆర్ కు షాక్ అని చెప్పాలి. తెలంగాణలో 40 స్థానాలు గెలుచుకున్న కేసీఆర్ ఎంఐఎం మద్దతుతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన శాసన సభ్యులను తమ వైపుకు తిప్పుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా అంత బలంగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ గులాబీ బాస్ కెసిఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఒక మాట కూడా మాట్లాడకుండా ఫామ్ హౌస్ కి ఎందుకు వెళ్లిపోయారు? అంటే ఓటమిని అంగీకరించారని చాలామంది చెబుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదు కెసిఆర్ వ్యూహాలు ఎవరికి అర్థం కావు అని చెబుతున్న వారు కూడా లేకపోలేదు.

తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ప్రలోభాలకు గురిచేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారో అని బి ఆర్ ఎస్ గురించి భయపడి, ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాలని భావించింది కాంగ్రెస్. వారి ఊహలకు అందకుండా కెసిఆర్ అటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా సైలెంట్ అయ్యారు. అంతేకాదు తమకు 40 స్థానాలు ఇచ్చిన ఓటర్లను ఉద్దేశించి కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా కేసీఆర్ వెళ్లిపోయారు.
అయితే కెసిఆర్ ఒక ఆరు నెలలపాటు బ్రేక్ తీసుకొని, తర్వాత ఊహించని విధంగా రాజకీయం చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులలో ఆసక్తికరచర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి, ఆరునెలల కాలం చూసి, ఆపై వారి వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తఎమ్మెల్యేలను తమ వైపుకి తిప్పుకొని తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి గులాబీ అధినేత కచ్చితంగా ప్లాన్ చేస్తారని చర్చిస్తున్నారు.
ఐదేళ్లపాటు పూర్తి కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించే అవకాశం లేదని, ఆ వ్యూహంతోనే సీఎం కేసీఆర్ ప్రస్తుతానికి సైలెంట్ అయినట్టుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడే ఆ పని చేస్తే ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి మరింత వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనలోనే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఏం చేసినా సఖ్యత కుదరదని, మళ్లీ అధికారం తమదేనని, అందుకు కేసీఆర్ మళ్ళీ ప్లాన్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు బలంగానే నమ్ముతున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications