ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారా: చెల్లింపులలో మార్పులు ఇలా!
తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇస్తున్న బిల్లుల చెల్లింపు విధానంలో స్వల్ప మార్పులు చేసింది. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ళ పథకం చెల్లింపులో స్వల్ప మార్పులు
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లింక్ చేయడంతో ఈ మార్పులు చేయవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలను, వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మాణం చేసేందుకు కేంద్రం అనుమతించిన కారణంగా ఈ మార్పులు చేయాల్సిన అవసరం వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

పరిపాలన సౌలభ్యం కోసమే మార్పులు: మంత్రి పొంగులేటి
లబ్ధిదారులకు చెల్లింపులలో చోటు చేసుకున్న ఈ స్వల్ప మార్పులు కేవలం లబ్ధిదారుల షెడ్యూల్ కు మాత్రమే పరిమితం అవుతాయని 5 లక్షల రూపాయలు చెల్లింపులు మాత్రం ఎటువంటి మార్పు ఉండదని మంత్రి వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఈ మార్పులు చేసినట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
మూడో దశ చెల్లింపులలో స్వల్ప మార్పులు
ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా మొదటి, రెండో దశలు పూర్తయిన తర్వాత లక్ష రూపాయల చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నామని, ఈ రెండు దశలో చెల్లింపులను ఎటువంటి మార్పు ఉండదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. మూడవ దశలో ఇచ్చే రెండు లక్షల రూపాయలను ఒక లక్ష అరవై వేల రూపాయలకు తగ్గించి మిగిలిన మొత్తాన్ని తర్వాతి దశల్లో జమ చేస్తామని పొంగులేటి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్
ఈ మార్పులను గమనించి లబ్ధిదారులు అందరు సహకరించాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, వారికి ఏవైనా ఇబ్బందులు ఉంటే, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో 18005995991టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసే లబ్ధిదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొంది.
కాల్ సెంటర్ కు ఫిర్యాదులు ఇలా
కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత నెల రోజుల్లోనే 14,950 ఫిర్యాదులు అందగా, ఫిర్యాదులలో ఎక్కువ శాతం బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చోటు చేసుకున్న మార్పులను అర్థం చేసుకొని లబ్ధిదారులు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications