• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss 5 Telugu: మేకప్ కిట్టే అని లైట్‌గా తీసుకుంటే..అదే ఎలిమినేషన్ టికెట్ అయ్యిందిగా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. ఇంకో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లోనూ ఈ టైటిల్ కోసం పోటీ పడుతోన్న కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 19 మందితో మొదలైన ఈ రియాలిటీ షో.. 13వ వారానికి ఏడుమంది మిగిలారు. ఈ వారం మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఇప్పటికి 12 మంది ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ దెబ్బ ఎవరి మీద పడుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

తగ్గుతున్న కంటెస్టెంట్ల సంఖ్య

తగ్గుతున్న కంటెస్టెంట్ల సంఖ్య

ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్య కారణాలతో జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత యానీ మాస్టర్ ఎలిమినేషన్‌ను ఎదుర్కొన్నారు. కిందటి వారం అనూహ్యంగా యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌ను వీడాడు. ఇది కాస్తా తీవ్ర వివాదాలు, విమర్శలకు దారి తీసింది. రాజకీయ రంగును కూడా పులుముకొంది.

ఆ ఒక్కడు తప్ప..

ఆ ఒక్కడు తప్ప..

ఈ వారం ఎలిమినేషన్ కోసం ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, మానస్ నాగులపల్లి, ఆర్జే కాజల్, సిరి హన్మంతు, ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ నామినేట్ అయ్యారు. శనివారం నాటి ఎపిసోడ్ సందర్భంగా శ్రీరామచంద్ర సేఫ్ అయ్యాడు. సేఫ్ కావడం మాత్రమే కాదు.. ఫైనల్‌కు సైతం అర్హత సాధించాడు. బిగ్‌బాస్ ఫైనల్‌కు చేరిన తొలి కంటెస్టెంట్‌గా ఎంపికయ్యాడు. మిగిలిన నలుగురిలో ముగ్గురు సేవ్ అవుతారు. ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది..

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది..

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ప్రికాంయ సింగ్. ఈ వారం ఆమె పెర్‌ఫార్మెన్స్ పట్ల వీక్షకుల నుంచి మార్కులు పడలేదు. ఓట్లూ రాలేదు. మిగిలిన అయిదుమందితో పోల్చుకుంటే.. అతి తక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. పూర్ పెర్‌ఫార్మెన్స్ వల్ల బిగ్ బాస్ టైటిల్ కంటెస్టెంట్ రేస్ నుంచి తప్పుకోక తప్పని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎంతసేపూ మానస్ నాగులపల్లి వెంటపడటం తప్ప టాస్క్‌లపై పెద్దగా ధ్యాస పెట్టలేదనేది వ్యూవర్స్ నుంచి అందిన కంప్లైంట్.

ఎవరికి అర్హత ఉందో తేల్చేసిన కంటెస్టెంట్లు

ఎవరికి అర్హత ఉందో తేల్చేసిన కంటెస్టెంట్లు

కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి కంటెస్టెంట్లు తమకు ఇష్టమైన వస్తువులు, గిఫ్ట్స్‌ను బిగ్‌బాస్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిని రిటర్న్ చేసే ఎపిసోడ్ శనివారం ముగిసింది. సిరి హన్మంతు, ప్రియాంకకు సంబంధించినవి మినహా మిగిలిన కంటెస్టెంట్ల వస్తువులు మళ్లీ హౌస్‌కు చేరాయి. సిరి హన్మంతు, ప్రియాంకల్లో ఒకరికి మాత్రమే ఆ వస్తువులు రిటర్న్ అవుతాయని, ఆ ఒక్కరే బిగ్‌బాస్ హౌస్‌లో కంటిన్యూ కావడానికి అర్హత ఉంటుందని అక్కినేని నాగార్జున పెట్టిన కండిషన్స్.. కంటెస్టెంట్లను కొంత టెన్షన్ పెట్టింది. ఈ ఎపిసోడ్‌లోనే హౌస్‌లో ఎవరు కొనసాగుతారనేది తేలిపోయింది. సిరి హన్మంతు వైపు కంటెస్టెంట్లు మొగ్గు చూాపారు.

మేకప్ కిట్ మాత్రమే కాదు..

మేకప్ కిట్ మాత్రమే కాదు..

కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ప్రియాంక తనకు ఇష్టమైన మేకప్ కిట్‌ను బిగ్‌బాస్‌కు అందజేసింది. అది మళ్లీ వెనక్కి తిరిగి రాలేదు. మేకప్ కిట్టే కదా అని తోటి కంటెస్టెంట్లు కూడా భావించారు. సిరి హన్మంతు కోసం తమ వస్తువులన శాక్రిఫైస్ చేశారు. వాటిని కాటాలో వేశారు. కాటా బరువు సిరి వైపు మొగ్గేలా చేశారు. ప్రియాంకతో పోల్చుకుంటే బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగే అర్హత సిరి హన్మంతుకు మాత్రమే ఉందని తేల్చేశారు. దీనితో సిరి బిగ్‌బాస్‌కు ఇచ్చిన ఇష్టమైన వస్తువు మళ్లీ ఆమెకే చేరింది. మేకప్ కిట్‌ ప్రియాంకకు అందులేదు. మేకప్ కిట్టే ప్రియాంకకు ఎలిమినేషన్ టికెట్ అయినట్టయింది.

English summary
Priyanka Singh has been evicted from the house due to the fewers votes. Priyanka was shown the door by Bigg Boss Telugu 5 host Nagarjuna and her elimination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X