• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss 5 Telugu: ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఐకాన్ హౌస్ నుంచి ఎలిమినేట్?: బోర్ కొట్టదా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5..ఆరో వారంలోకి ఎంట్రీ అయింది. ఇంకో రెండు రోజుల్లో ఎలిమినేషన్‌ డే వచ్చేస్తుంది. మరొ కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఈ వారం ఎవరు బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనే హాట్ డిబేట్‌‌గా మారింది.

ఇప్పటిదాకా వరుసగా మూడు వారాల్లో ముగ్గురు విమెన్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. మేల్ కంటెస్టెంట్ నాలుగో ఎలిమినేటర్‌గా నిలిచాడు. ఆ తరువాత మళ్లీ ఫీమేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారంలో ఎవరనేది తేలాలంటే ఇకో 48 గంటలు పడుతుంది.

ఇప్పటిదాకా ఈక్వేషన్స్ వేరే..

ఇప్పటిదాకా ఈక్వేషన్స్ వేరే..

ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఎలిమినేట్ అయ్యారు. వీక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు రాలేదు. బిగ్‌బాస్ హౌస్‌లో నేచురల్‌గా ఉండలేకపోయారని, ఈ రియాలిటీ షోలో ఆర్టిఫీషియల్‌గా కనిపించారనేది కారణాలుగా చెబుతున్నారు నెటిజన్లు. ఈ వారం అలాంటి కంటెస్టెంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్‌, హమీదా లిస్ట్‌లో చేరబోయే ఎలిమినేటర్ ఎవరో తెలిసిపోయింది. ఇప్పటిదాకా సాగిన ఈ ఈక్వేషన్స్ మారనున్నాయి.

ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నది ఎవరు?

ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నది ఎవరు?

అయిదో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయిన వారి సంఖ్య 10కి పెరిగింది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 15 మందిలో సగం మందికి పైగా కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయ్యారు. వీజే సన్నీ, మానస్ నాగులపల్లి, ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ, యాంకర్ రవి, ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, జెస్సీ, సిరి హన్మంతు, లోబో, విశ్వ, నటి శ్వేతా వర్మ నామినేట్ అయ్యారు. శ్వేతా వర్మ ఈ సారి లౌడ్ స్పీకర్ రోల్‌గా కనిపించారు. బ్రోక్ అవుట్ అయ్యారు.

సేఫ్ జోన్‌లో ఎవరు?

సేఫ్ జోన్‌లో ఎవరు?

10 మంది నామినేట్ అయిన కంటెస్టెంట్లలో టాప్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఓటింగ్‌లో తనదైన శైలిలో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అతనికి హయ్యెస్ట్ ఓట్లు పోల్ అయ్యాయి. ప్రస్తుతానికి అతనే టాపర్‌గా నిలిచాడు. 14 వేలకు పైగా ఓట్ల పోల్ అయినట్లు చెబుతున్నారు. 14 వేలకు పైగా ఓట్లను సాధించడం వరుసగా అతినికి ఇది రెండోసారి. కిందటి వారం కూడా అతను ఈ మార్క్‌ను అందుకున్నాడు. రెండో స్థానంలో సన్నీ నిలిచాడు. 12 వేలకు పైగా ఓట్లు పడినట్లు సమాచారం. శ్రీరామచంద్ర మూడో స్థానంలో ఉన్నాడట. అతను ఎనిమిది వేల వరకు ఓట్లను సాధించినట్లు టాక్ ఉంది.

శ్వేతా వర్మ కూడా..

శ్వేతా వర్మ కూడా..

అత్యధిక ఓట్లను సాధించిన కంటెస్టెంట్ల లిస్ట్‌లో శ్వేతా వర్మ కూడా ఉన్నారు. శ్రీరామచంద్రతో పోటీ పడుతున్నారు. ఆమెకు 7,500లకు పైగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది. యాంకర్ రవి- 5,000, జెస్సీ- 4,500, ప్రియాంక సింగ్- 4,000 వేల ఓట్లు పడినట్లు చెబుతున్నారు. చిట్టచివరి స్థానంలో విశ్వ, లోబో, సిరి హన్మంతు ఉన్నారని చెబుతున్నారు. ఈ ముగ్గురిలో లోయెస్ట్ ఓటింగ్ షేర్‌ను లోబో, విశ్వ సాధించారని అంటున్నారు. ఈ ఇద్దరిలోనూ లోబోకు అతి తక్కువగా ఓట్లు వచ్చాయని సమాచారం.

రెడ్ జోన్‌లో లోబో..

రెడ్ జోన్‌లో లోబో..

ఈ నేపథ్యంలో లోబో.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. నిజానికి అతినిక ఎంటర్‌టైన్‌మెంట్ ఐకాన్‌గా చెబుతుంటారు కంటెస్టెంట్లు. లోబో మంచి టైమ్ పాస్ అందిస్తున్నాడనే టాక్ ఉంది. ఎప్పుడైతే అతను ప్రియపై గట్టిగా అరవడం, వీక్షకులపై తప్పుగా మాట్లాడటం వంటివి చోటు చేసుకున్నాయో.. అప్పటి నుంచే అతని డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. ఇది వరకు అతను నటరాజ్ మాస్టర్‌తో పాటు ఎలిమినేషన్ రౌండ్‌లో చివరి వరకూ నిలిచాడు. అతి తక్కువ ఓటింగ్‌ను సాధించాడు. నటరాజ్ మాస్టర్ కంటే కొంత బెటర్ కావడం వల్ల ఆ వారం అతను సేఫ్ అయ్యాడని అంటున్నారు.

టాస్క్‌ల్లో అతిగా..

టాస్క్‌ల్లో అతిగా..

ఈ దఫా ఆ ఛాన్స్ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో నెలకొన్నాయి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేసే ప్రక్రియలో లోబో కొంత కట్టు తప్పుతున్నాడంటూ తోటి కంటెస్టెంట్లు సైతం అభిప్రాయపడుతున్నారు. కిందటి వారం ఎలిమినేట్ అయిన హమీదా సైతం ఇదే విషయాన్ని వ్యక్తం చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ పంచే లోబో.. తన వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తుండటం వల్ల కొంత వీక్షకులు కూడా అసహనంగా ఉన్నారని, దాని ప్రభావం.. ఓటింగ్‌పై పడిందని చెబుతున్నారూ చాలామందే ఉన్నారు.

English summary
Bigg Boss 5 Telugu Elimination This Week: Lobo Out Of House For This Reason
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X