• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ కంటెస్టెంట్లందరినీ ఇలా ఎలిమినేట్ చేస్తున్నారేంటీ?: దెబ్బకొట్టిన వరస్ట్ పెర్‌ఫార్మెన్స్: ఆమె అవుట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరుసగా మూడోసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5..ఆరోవారంలోకి ఎంట్రీ అయింది. సండే.. ఎలిమినేషన్‌ డే కూడా వచ్చేసింది. మరో కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్ నుంచి తన ఇంటికి వెళ్లిపోనున్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే హాట్ డిబేట్‌‌గా మారింది.

ఇప్పటిదాకా వరుసగా తొలి మూడు వారాల్లో ముగ్గురు విమెన్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. నాలుగో వారం దీనికి బ్రేక్ పడింది. ఫోర్త్ ఎలిమినేటర్‌గా నటరాజ్ మాస్టర్ నిలిచాడు. ఆ తరువాత అయిదో వారం కూడా మళ్లీ ఫిమేల్ కంటెస్ట్ంట్ ఈ షో నుంచి ఎవిక్ట్ అయ్యారు. హమీదా ఖాతూన్ ఎలిమినేట్ అయ్యారు.

ఎలిమినేషన్ లిస్ట్‌లో

ఎలిమినేషన్ లిస్ట్‌లో

ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్ ఎలిమినేట్ అయ్యారు. వీక్షకులు వారిని పెద్దగా ఆదరించలేదు. ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. అలాంటి కంటెస్టెంట్ ఒకరు ఈ సిక్స్త్ వీక్ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ కానున్నారు. వీజే సన్నీ, మానస్ నాగులపల్లి, ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ, యాంకర్ రవి, ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, జెస్సీ, సిరి హన్మంతు, లోబో, విశ్వ, నటి శ్వేతా వర్మ నామినేట్ అయ్యారు. శ్వేతా వర్మ ఈ సారి లౌడ్ స్పీకర్ రోల్‌గా కనిపించారు.

సేఫ్ జోన్‌లో ఎవరు?

సేఫ్ జోన్‌లో ఎవరు?

10 మంది నామినేట్ అయిన కంటెస్టెంట్లలో టాప్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఓటింగ్‌లో తనదైన శైలిలో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అతనికి హయ్యెస్ట్ ఓట్లు పోల్ అయ్యాయని, అతనే టాపర్‌గా నిలిచాడని సమాచారం. షణ్ముఖ్‌కు 14 వేలకు పైగా ఓట్ల పోల్ అయినట్లు చెబుతున్నారు. కిందటి వారం కూడా అతను ఈ మార్క్‌ను అందుకున్నాడు. రెండో స్థానంలో సన్నీ నిలిచాడు. 12 వేలకు పైగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది. శ్రీరామచంద్ర మూడో స్థానంలో ఉన్నాడు. అతను ఎనిమిది వేల వరకు ఓట్లను సాధించినట్లు టాక్ ఉంది.

యాంకర్ రవి

యాంకర్ రవి

అత్యధిక ఓట్లను సాధించిన కంటెస్టెంట్ల లిస్ట్‌లో యాంకర్ రవి ఉన్నారు. నాలుగో స్థానంలో నిలిచాడతను. అతనికి ఎనిమిది వేలవరకు ఓట్లు పడినట్లు అంచనా. లోబో, ప్రియాంక సింగ్, సిరి హన్మంతు, జెస్సీ నిలిచారు. చిట్టచివరి స్థానంలో విశ్వ, శ్వేతా వర్మ నిలిచారు. వారిద్దరిదీ లోయెస్ట్ ఓటింగ్ షేర్‌. బిగ్‌బాస్ ఫ్యాన్స్ నుంచి అంచనాలకు అనుగుణంగా ఓట్లను సాధించడంలో వారిద్దరూ విఫలం అయ్యారు. ఎలిమినేషన్ రౌండ్‌లో చివరి రౌండ్ వరకూ నిలవడం విశ్వకు ఇది రెండోసారి కూడా.

నాట్ సేఫ్..

విశ్వ కంటే కూడా లీస్ట్ ఓట్లను అందుకున్న శ్వేతా వర్మ.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆరో వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ వారం వరస్ట్ పెర్‌ఫార్మర్ అనే ముద్రను వేయించుకున్నారు శ్వేతా వర్మ. జైలులో కూడా గడిపారు. ఈ అయిదు వారాల పాటు నామినేషన్‌లో కూడా లేకుండా నెగ్గుకొచ్చిన శ్వేత వర్మా.. ఈ దఫా ఈ లిస్ట్‌లోకి వచ్చారు. ఎలిమినేట్ కానున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది.

సెట్ ప్రాపర్టీ డ్యామేజ్..

ఓ టాస్క్ సందర్భంగా శ్వేతా వర్మ, లోబో.. సెట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారనే చెడ్డపేరును తెచ్చుకున్నారు. ఈ విషయంలో హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా వారి మీద ఫైర్ అయ్యారు. హౌస్‌లోని కుష‌న్స్‌ను చింపేసి అందులోని దూదిని వాడి బొమ్మ‌లు త‌యారు చేశారు వారిద్దరూ. నిజానికి అది యాంకర్ రవి ఐడియా. దీనితో శనివారం నాటి ఎపిసోడ్‌లో ఈ విషయంలో శ్వేతా వర్మ, రవి మధ్య డిబేట్ కూడా సాగింది. వాళ్లిద్ద‌రూ కుష‌న్స్‌ను పాడు చేయ‌కుండా అడ్డుకోలేక‌పోయారంటూ సిరి హన్మంతు, ఆర్జే కాజ‌ల్‌ను డిస్ క్వాలిఫై సైతం చేశారు. సెట్ ప్రాపర్టీ డ్యామేజ్ వ్యవహారం కూడా శ్వేత వర్మకు మైనస్‌గా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సీక్రెట్ హౌస్‌కు లోబో..

అటు వీక్షకులకు, ఇటు బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు మంచి టైమ్ పాస్ అందిస్తున్నాడనే టాక్ ఉన్న లోబో.. ఊహించని విధంగా సీక్రెట్ హౌస్‌కు వెళ్లాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే అనుమానాన్ని కలిగించాడు అక్కినేని నాగార్జున. లోబో ఎలిమినేట్ అయ్యాడంటూ.. హౌస్ నుంచి బయటికి పిలిపించి.. కంటెస్టెంట్ల మీద తనకు ఉన్న అభిప్రాయాన్ని తీసుకున్న తరువాత.. చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చాడు. వారం రోజుల పాటు సీక్రెట్ హౌస్‌లో ఉండే ఏర్పాటు చేశాడు. అనంతరం లోబో నేరుగా నామినేషన్స్‌లోకి వెళ్తాడు.

English summary
According to our sources Swetha Varma and Vishwa are in danger zone. The buzz on social media suggests that Swetha Varma has reportedly been eliminated from the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X