Pallavi Prashanth: చంచల్ గూడ జైలుకు పల్లవి ప్రశాంత్..
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అస్తుల ధ్వంసం కేసులో అరెస్టైన అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు జూబ్లీహిల్స్ ఏసీపీ హరి ప్రసాద్ చెప్పారు. ప్రశాంత్ తమ్ముడు మహా వీరేశంకు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించిందినట్లు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ప్రశాంత్, వీరేశంలను జూబ్లీహిల్స్ పోలీసులు గజ్వేల్ లో అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ కు తరలించి విచారించారు. తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు.
జడ్జి రిమాండ్ విధించడంతో ప్రశాంత్, వీరేశంలను హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. త్వరలో కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎస్‌ఎస్‌ఐ మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయమున్న నరేందర్, అతని స్నేహితుడు వినయ్, కారు డ్రైవర్లు సాయికిరణ్, ఎ.రాజుపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆదివారం బిగ్‌బాస్ సీజన్ -7 ఫైనల్స్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది.

ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. అనంతరం కొంతమంది రాళ్లతో బిగ్‌బాస్ సీజన్ 6 లో పాల్గొన్న గీతూ రాయల్, ప్రస్తుత సీజన్ కంటెస్టెంట్ అశ్వినీ కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం రోడ్డుపైకి వచ్చి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. అయితే బిగా బాస్ 7 లోకి కామన్ మెన్ గా అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ అసాధారణ ఆటతో ఫైనల్ కు చేరాడు. భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రశాంత్ తన యూట్యూబ్ ఛానల్ తో రైతుల చేసే కష్టాన్ని ప్రజలకు చూపించాడు.
దీంతో అతను బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి విజేతగా నిలిచాడు. అయితే అతను విజేతగా నిలిచి మూడు రోజులు కాకముందే పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. అయితే గొడవలకు పల్లవి ప్రశాంత్ ఏమైన సంబంధం ఉందా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications