Big Boss Telugu 5: ఆ బూతుల కంటెస్టెంట్ అవుట్: ఫస్ట్ ఎలిమినేటర్‌గా ఆమె
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఆరంభంలోనే అదరగొట్టింది. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ ఇంట్రడ్యూసింగ్ ఎపిసోడ్ నుంచే వారి మధ్య కంటెస్టెంట్స్ కూడా మొదలయ్యాయి. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని..దాని కోసం నిత్యం స్ట్రగుల్ అవుతోన్న వారు ఈ సారి చాలామంది బిగ్‌బాస్ టైటిల్ వేటలో ఉన్నారు. కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితులు కావడానికి బిగ్‌బాస్ హౌస్ తిరుగులేని వేదిక.

ఎలిమినేషన్.. అయ్యేదెవరు?
అప్పుడే ఎలిమినేషన్ డే వచ్చేసింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు బయటికి ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. ఎలిమినేషన్ కోసం మొత్తం ఆరు మంది సెలెక్ట్ అయ్యారు. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్ ప్రకారం.. యాంకర్ రవి, హమీదా సేఫ్ జోన్‌లో ఉన్నారు. వారిద్దరూ ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి బయటపడ్డారు. ఇక మిగిలింది నలుగురు. రేడియో జాకీ కాజల్, జెస్సీ, సరయు, మానస్ నాగులపల్లి ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠతగా మారింది.

ఆమె అవుట్..
లేటెస్ట్‌గా అందిన సమాచారాన్ని బట్టి చూస్తోంటే- ఈ నలుగురిలో సరయు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. ఫస్ట్ వీక్‌లోనే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆమె ఎవిక్ట్ అవుతారని సమాచారం. వీక్షకుల నుంచి పెద్దగా ఆమెకు ఓట్లు రాలేదని, ఫలితంగా ఆమెను హౌస్ నుంచి బయటికి పంపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరయు తరువాత అతి తక్కవ శాతం ఓట్లు జెస్సీకి పోల్ అయ్యాయని అంటున్నారు. ఆదివారం రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో తొలుత ఆర్జే కాజల్, ఆ తరువాత మానస్ నాగులపల్లి సేఫ్ జోన్‌లోకి వెళ్తారని చెబుతున్నారు.

చివరి వరకూ జెస్సీ, సరయు
ఆ తరువాత జెస్సీ, సరయు ఎలిమినేషన్ చివరి రౌండ్ వరకు కొనసాగుతారు. వారిలో జెస్సీ సేఫ్ జోన్‌లోకి వెళ్లగా.. సరయు మాత్రం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనే ప్రచారం సాగుతోంది. సరయు.. బిగ్‌బాస్ హౌస్‌లో సహజంగా ఉండలేకపోతున్నారని, తన ఫైర్ బ్రాండ్‌ను కనపర్చట్లేదనే వాదనలు కూడా లేకపోలేదు. ఆమె ఎలిమినేషన్‌తో ఆ ప్రాసెస్ ఆరంభమౌతుందని అంటున్నారు. బోల్డ్‌గా, ఓపెన్‌గా మాట్లాడటం ద్వారా సరయు యూట్యూబ్ సెలెబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు.

సహజంగా ఉండలేకపోతున్నారా?
ఆమె పార్టిసిపేట్ చేసిన అనేక వీడియోలు యుట్యూబ్‌లో ఉన్నాయి. మహిళలకు సంబంధించిన కొన్ని సామాజికాంశాల గురించి బోల్డ్‌గా, అంతకుమించి ఓపెన్‌గా, పురుషులతో పోటీ పడేలా మాట్లాడే సెలెబ్రిటీగా పేరుంది సరయుకు. సరయు క్లినిక్‌లో పెళ్లిచూపులు అనే షార్ట్ ఫిల్మ్‌తో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంత ఓపెన్ మాట్లాడే మనస్తత్వం ఉన్న సరయు బిగ్ బాస్ హౌస్‌లో అంతే.. నేచురల్‌గా ఉండలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications