Bigg Boss 5 Telugu Grand Finale: గ్రాండ్ ఫినాలేకు మెగా హీరోస్ - బాలీవుడ్ స్టార్ల తో కలిసి సందడి..!!
ఊహించని ట్విస్టులతో అనేక మలుపులు తీసుకున్న బిగ్ ఎంటర్ టైన్ మెంట్ షో బిగ్ బాస్ -5 తుది సమరానికి సిద్దమైంది. ఈ ఆదివారం ఈ సిరీస్ కు ముగింపు ఇవ్వనున్నారు. ఏకంగా ఈ సిరీస్ 19 మంది పార్టిసి పెంట్స్ తో మొదలైంది. చివరగా ఫైనల్ కు అయిదుగురు చేరారు. సన్నీ, మానస్, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి టైటిల్ బరిలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఇక, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేను గతం కంటే భిన్నంగా..ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా.. ఈసారి గ్రాండ్ ఫినాలే కు ప్రముఖ స్టార్లను ఆహ్వానించినట్లు సమాచారం.

మెగా హీరోల సందడి ఖాయమంటూ
ఇక, తమ అభిమాన కంటెస్టెంట్ ను గెలపించుకొనేందుకు వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా భారీగా ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఓటింగ్ తో గెలిపించాలని కోరుతున్నారు. కంటెస్టెంట్స్ లో మిగిలిన అయిదుగురులో తమ హీరోలను ఆరాధించే వారెవరో తెలుసుకున్న అభిమానులు సైతం వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇక, ఫినాలే ఎప్పుడూ ఘనంగా నిర్వహించే నిర్వాహకులు.. గత సీజన్లలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్‌బాస్ విజేతలకు టైటిల్ అందించారు.

సోషల్ మీడియా వేదికగా ప్రచారం
ఇక, సారి రాబోయే గెస్టుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ సారి ఫినాలేకు మెగాస్టార్ తనయుడు.. మెగా పవర్ స్టార్ రాం చరణ్.. ఐకాన్ స్టార్ పుష్ఫ గా రచ్చ చేస్తున్న అల్లు అర్జున్ తో పాటుగా బాలీవుడ్ ప్రముఖులు బిగ్‌బాస్ వేదికపై సందడి చేయనున్నట్లు సమాచారం. రామ్ చరణ్.. బిగ్‌బాస్ షోకు ఇప్పటికే హాజరయ్యారు. అయితే, ఈ సారి అయిదుగురు చివరి వరకు రేసులో ఉన్నా..సోషల్ మీడియాలో మాత్రం ప్రముఖంగా సన్నీ పేరు ట్రెండింగ్ లో కనిపిస్తోంది. అందరినీ సరదాగా నవ్విస్తూ బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు సాధించారు.

ఈ సిరీస్ విజేత ఫైనల్ అయిపోయిందా
తోటి కంటెస్టెంట్స్ నామినేట్ చేసినా నవ్వుతూ..హుందాగా స్వీకరించారు. సిరి, షణ్ముఖ్‌లతో గొడవలు పడినా ఆ సందర్భానికే వాటిని పరిమితం చేసారు. తన స్పాంటిన్యుటీతో ప్రేక్షకుల అభిమానంతో పాటుగా..ఫ్యాన్స్ ఓటింగ్ సన్నీకు ప్రతీ సందర్భంలో కలిసి వచ్చింది. పలు మార్లు నామినేట్ అవుతున్నా..ఫ్యాన్స్ ఓటింగ్ కాపాడింది. తాజా ఎపిసోడ్‌లోనూ బిగ్‌బాస్ సన్నీపై ప్రశంసలు కురిపించారు. బిగ్ బాస్ సైతం సన్నీని పొగిడిన తీరు చూస్తూ ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అతనే అనే నమ్మకం ఏర్పుడుతోంది.

సందడిగా ఫినాలే సెలబ్రేషన్స్
హౌస్‌లో తోటి కంటెస్టెంట్లతో గొడవలు, ఒడిదొడుకులు ఎదురైనా అందరి ముఖాల్లో నవ్వు తీసుకొచ్చేందుకు ప్రయత్నించావు. బెస్ట్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాదించావు. ఒంటరి మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కన్నా పెద్ద విజయమేమీ లేదని నీ వండర్‌ఫుల్ జర్నీతో నిరూపించావు. అప్నా టైం ఆయేగా.. సన్నీ..అంటూ ఆకాశానికెత్తేసారు. ఇదే సమయంలో సన్నీకు సోషల్ మీడియా ప్లాట్ ఫాంల నుంచి పెద్ద ఎత్తున అనుకూల క్యాంపెయిన్ నడుస్తోంది. ఇక, ప్రముఖ హీరోల ఎంట్రీ... బాలీవుడ్ స్టార్లతో కలిసి మెగా హీరోల సండది నడుమ... ఈ సిరీస్ విజేత ఎవరనేది తేలాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే.












Click it and Unblock the Notifications