Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Big Boss Telugu 5: బిగ్‌బాస్ హౌస్‌లో ఫిమేల్ అర్జున్ రెడ్డి: ఆ అగ్రిసివ్ నెస్‌కు నెటిజన్స్ ఫిదా

హైదరాబాద్: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. రోజులు గడిచే కొద్దీ కంటెస్టెంట్లు ఎమోషన్ మోడ్‌లోకి వెళ్తోన్నారు. టాస్క్, ఎలిమినేషన్స్.. ఇవన్నీ ఎప్పట్లాగే ఉత్కంఠతకు గురి చేస్తోన్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందోననే ఆసక్తిని కలిగిస్తోన్నాయి. తొలివారంలోనే ఈ రియాలిటీ షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే సస్పెన్స్‌ను క్రియేట్ చేయడంలో కంటెస్టెంట్లు ఒకింత సక్సెస్ అయ్యారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం తేలిపోతుంది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

సోషల్ మీడియాలో ఫ్యాన్ క్లబ్స్..

సోషల్ మీడియాలో ఫ్యాన్ క్లబ్స్..

బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ అందరూ సెలెబ్రిటీలే. వారికి ఫ్యాన్ క్లబ్స్ కూడా ఏర్పాటయ్యాయి సోషల్ మీడియాలో. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ వేదికగా మెజారిటీ కంటెస్టెంట్లందరికీ ఫ్యాన్ క్లబ్స్ క్రియేట్ అయ్యాయి. హాట్‌గా కనిపించే సరయు, లహరి షారీ, బొద్దుగా హోమ్లీగా ఉంటోన్న నటి ప్రియ, యాంకర్ రవి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, విజయవాడ అమ్మాయి ఆర్జే కాజల్, హమీదా..ఇలా మెజారిటీ కంటెస్టెంట్లకు అప్పుడే అభిమానులు కూడా ఏర్పడ్డారు.

 అగ్రెసివ్‌నెస్‌కు ఫిదా..

అగ్రెసివ్‌నెస్‌కు ఫిదా..

హౌస్‌లో అందరికంటే అగ్రెసివ్‌గా కనిపిస్తోన్నారు లహరి షారీ. తోటి కంటెస్టెంట్ హమీదాతో గొడవ పడే సందర్భాలు.. ఆమెను ఫైర్‌బ్రాండ్‌గా ముద్రవేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. తన వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచేలా కంటెస్టెంట్లు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. లహరీ షారీ తిప్పికొట్టే తీరు తమను ఆకట్టుకుంటోందంటూ పోస్టులు పెడుతున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఫిమేల్ అర్జున్ రెడ్డిలా వ్యవహరిస్తోన్నారంటూ కితాబిస్తోన్నారు నెటిజన్లు.

ఆ మూవీలో

ఆ మూవీలో

నిజానికి- మీడియా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు లహరి షారీ. సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ అట్రాక్టిక్ యాంకర్‌గా పేరు పొందారు. ఆ గుర్తింపుతోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కంట్లో పడ్డారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో ఓ క్యారెక్టర్‌లో తళుక్కుమంటూ మెరిశారు. ఈ మూవీలో ఆమె నర్స్ పాత్రను పోషించారు. తాజాగా- బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఛాన్స్ కొట్టేశారు.

 ఫిమేల్ అర్జున్ రెడ్డి..

ఫిమేల్ అర్జున్ రెడ్డి..

తొలివారంలోనే ఆమె తన మార్క్‌ ఫైర్‌ను చూపిస్తోన్నారు హౌస్‌లో. ప్రత్యేకించి- హమీదాను ఫేస్ చేసిన సందర్భాల్లో లహరీ షారీ ఇచ్చిన కౌంటర్ అటాక్ నెటిజన్లను ఆకట్టుకున్నట్టే. ఆమెలో ఓ అర్జున్ రెడ్డి కనిపిస్తోన్నాడనే కామెంట్స్ వ్యక్తమౌతోన్నాయి సోషల్ మీడియాలో. ఎలిమినేట్ కోసం నామినేట్ చేసుకోవడంతో వారిద్దరి మధ్య కోపతాపాలు పెరిగాయి. జెస్సీ, యాంకర్ రవి, సరయు, ఆర్జే కాజల్‌, మానస్‌, హమీదా తొలివారంలోనే ఎలిమినేషన్స్‌కు నామినేట్ అయ్యారు.

ఎలిమినేట్ అయ్యేది అతనేనా..

ఎలిమినేట్ అయ్యేది అతనేనా..

వారిలో ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారనేది ఇంకో రెండు రోజుల్లో తేలుతుంది. మోడలింగ్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన జెస్సీ ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అవుతారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మిగిలినవారితో పోల్చుకుంటే- అతను పెద్దగా ఫేమ్ ఉన్న కంటెస్టెంట్ కాదని, అందుకే అతనికి ఓటింగ్ పర్సంటేజీ తక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.. అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ అంచనాలు, అభిప్రాయాలు ఎంతవరకు నిజం అవుతాయనేది తెలియాలంటే ఇంకో రెండురోజులు ఎదురు చూడక తప్పదు.

Recommended Video

    #BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Oneindia Telugu
    ఫిల్మ్ అండ్ టీవీ బ్యాక్‌గ్రౌండ్..

    ఫిల్మ్ అండ్ టీవీ బ్యాక్‌గ్రౌండ్..

    బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో చాలామంది ఫిల్మ్ అండ్ టీవీ నటీనటులు ఉన్నారు. వీజే సన్నీ, లహరి షారీ, ఇండియన్ ఐడల్ విన్నర్, టాప్ సింగర్ శ్రీరామచంద్ర బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా హౌస్‌లో గ్రాండ్‌గా అడుగు పెట్టారు. లోబో సైతం తనదైన మార్క్‌ను చూపిస్తోన్నాడు. అతని అసలు పేరు మహ్మద్ ఖయ్యుం. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో అట్రాక్ట్ చేస్తోన్నాడతను. ఇదివరకు నేచురల్ స్టార్ నాని నటించిన పైసా మూవీలో కనిపించాడు. నాని స్నేహితుల్లో ఒకడిగా నటించాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+