Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇందూరులో దారుణం: వివాహిత గొంతుకోసి, కాలివేళ్లు కోసి చిత్రవధ, పసుపు, కారం చల్లి, దీపం వెలిగించి...

నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఆర్యనగర్‌లో పట్టపగలు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వివాహిత వరలక్ష్మీని దారుణంగా హత్య చేశారు. గొంతుకోసి చంపడమే గాక.. కాలి వేళ్లను కూడా నరికేశారు. ఆమె ఒంటిపై ఉన్న ఐదు తులాల బంగారం, ఇంట్లో ఉన్న బంగారం, నగదును దోచుకెళ్లారు. ఆమె మృతదేహం వద్ద పసుపు, కారం చల్లి.. చట్టం నుంచి తప్పించుకుందామని అనుకొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులను గుర్తించేపనిలో నిమగ్నమయ్యారు.

 బీభత్సం..

బీభత్సం..

ఆర్యనగర్‌లో వివాహిత వరలక్ష్మీ దంపతులు ఉంటున్నారు. ఎప్పటిలాగే సోమవారం కూడా వరలక్ష్మీ ఇంట్లో ఉన్నారు. కానీ దొంగల రూపంలో ఉన్న మృగాళ్లు ఆమె ప్రాణం తీసేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. అరిచి గీ పెడుతుందనే అనుమానంతో దాడి చేశారు. గొంతుకోసి హతమార్చారు. తర్వాత కాలి మెట్టెలు కూడా తీసేందుకు వేళ్లను నరికేసి తమ పైశాచికాన్ని చాటుకొన్నారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు సహా మొత్తం ఐదు తులాల బంగారం, నగదును తీసుకెళ్లారు.

తెలివిగా..

తెలివిగా..

బంగారం, నగదు తీసుకెళ్తే అనుమానం వస్తుందని అనుకొన్నారే ఏమో... వరలక్ష్మీని దారుణంగా హతమార్చారు. కాలి వేళ్లను కూడా హతమార్చారు. డాగ్ స్వ్కాడ్ పోలీసులు తమను పట్టుకోవద్దనే ఉద్దేశంతో పసుపు, కారం చల్లి తెలివిగా ప్రవర్తించారు. వివాహిత మృతదేహం వద్ద దీపాలు వెలిగించారు. దోపడీ దొంగలు ఇలా చేయరని.. కేసును తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేశారనే భావన వ్యక్తమవుతోంది. స్థానిక దొంగలు ఈ విధంగా ప్రవర్తించరని.. మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా ఇలా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 మిట్టమధ్యాహ్నాం..

మిట్టమధ్యాహ్నాం..

మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్యనగర్‌లో గల వివాహిత ఇంటికి ఎవరొచ్చారు. ఎవరు వెళ్లారనే అంశంపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. దీంతోపాటు వివాహిత ఇంటిపై ఉన్నవారిని కూడా విచారిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అలికిడి కాలేదా..? శబ్ధం వినిపించినా.. ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తనికి ఇందూరు నడిబొడ్డున జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. హత్య చేసింది ఎవరనే అంశంపై పోలీసుల దర్యాప్తులో నిజనిజాలు వెలుగుచూడాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+