పవన్ కళ్యాణ్‌ను చూస్తే నవ్వొస్తోంది, అన్న కొడుకే నయం: కిషన్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నటించడమే రాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏలా నెగ్గుకొస్తారని బిజెపి శాసనసభపక్షనాయకుడు కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను మీడియానే పెద్ద నాయకుడిగా తయారు చేస్తోందని ఆయన చెప్పారు.రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో అమిత్‌షా పర్యటించేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.

కారణమిదే: ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్గొండ అసెంబ్లీకి బొడ్డుపల్లి లక్ష్మి?

బిజెపి శాసనసభపక్ష నాయకుడు కిషన్‌రెడ్డి మంగళవారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు..రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కిషన్ రెడ్డి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఒక్క సీటు గెలిచినా అసెంబ్లీలో అడుగుపెట్టను: జగదీష్ రెడ్డి సంచలనం

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై బిజెపి నేత కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్‌కు కనీసం నటించడం కూడ రాదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తోన్నా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిధులను వినియోగించుకోవడం లేదన్నారు కిషన్ రెడ్డి.

పవన్‌పై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి

పవన్‌పై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై బిజెపి శాసనసభపక్ష నేత కిషన్‌రెడ్డి విరుచుకుపడ్డారు.పవన్ కళ్యాణ్‌కు కనీసం నటించడం కూడ రాదన్నారు.సోదరుడు చిరంజీవిని అడ్డుపెట్టుకొని సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఎదిగారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ కంటే ఆయన సోదరుడి కొడుకు సినిమాల్లో బాగా నటిస్తాడని కిషన్ రెడ్డి చెప్పారు.పవన్ కళ్యాణ్ హవబావాలు చూస్తే నవ్వొస్తోందన్నారు.

రేవంత్ రెడ్డి బిజెపిలో ఇమడలేడు

రేవంత్ రెడ్డి బిజెపిలో ఇమడలేడు

రేవంత్ రెడ్డి బిజెపిలో ఒమడలేడని ఆ పార్టీ శాసనసభపక్ష నేత కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బిజెపి క్రమశిక్షణ గల పార్టీ అని కిషన్ రెడ్డి చెప్పారు. బిజెపి క్రమశిక్షణణు రేవంత్ తట్టుకోడని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎంచుకొన్నారనే అభిప్రాయాన్ని కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు.

పాదయాత్ర చేస్తాం

పాదయాత్ర చేస్తాం

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకుగాను పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నామని బిజెపి శాసనసభపక్ష నేత కిషన్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై ఫిబ్రవరి 14వ, తేదిన జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు.

తెలంగాణలో అమిత్‌షా టూరు

తెలంగాణలో అమిత్‌షా టూరు

తెలంగాణ రాష్ట్రంలో అమిత్‌షా తరచూ పర్యటించేలా ప్లాన్ చేస్తామని బిజెపి శాసనసభపక్ష నేత కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా తాము ప్లాన్ చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.వ్యక్తిగత దూషణలకు బిజెపిలో తావులేదన్నారు. రానున్న రోజుల్లో తమ పార్టీ తీసుకొనే నిర్ణయాలతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.

హంగ్ వస్తోంది

హంగ్ వస్తోంది

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని బిజెపి శాసనసభపక్ష నేత కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణకు కేంద్రం నుండి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు..

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bjlp leader Kishan reddy sensational comments on Janasena chief Pawan Kalyan on Tuesday. He is not good actor said Kishan reddy. He was chit chat with media on Tuesday at Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి