దుబ్బాక దంగల్: 2 రౌండ్లలో బీజేపీ లీడ్..రెండో స్థానంలో టీఆర్ఎస్
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. ఫస్ట్, సెకండ్ రౌండ్‌లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కనిపించారు. ఇక్కడ మొత్తం 23 రౌండ్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. సిద్దిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

23 రౌండ్లు..
23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగుస్తోందని.. ప్రతీ హాల్ లో 7 టేబుల్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ భారతీ తెలిపారు. అయితే పోస్టల్ బ్యాలెట్‌లో మాత్రం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఈవీఎం ఓట్ల లెక్కించడం ప్రారంభించగా.. బీజేపీ లీడ్‌లో కొనసాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 3208 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ సుజాతకు 2867 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డికి 648 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో బీజేపీ 341 ఓట్ల లీడ్ సాధించింది.

లీడ్‌లో బీజేపీ
రెండో రౌండ్‌లో బీజేపీకి 1561 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థికి 1282 ఓట్లు వచ్చాయి. రఘునందన్ రావుకు 279 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండు రౌండ్ల వారీగా చూస్తే బీజేపీకి 4769, టీఆర్ఎస్ 4149, కాంగ్రెస్ 922 ఓట్లు వచ్చాయి. మొత్తంగా రఘునందన్ రావు 620 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. అయితే మరో 21 రౌండ్లు ఉన్నందున ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది.
Recommended Video


టికెట్ ఖరారు కాకముందే
దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే టికెట్ ఖరారు కాక ముందు రఘునందన్ రావు దుబ్బాకలో జోరుగా ప్రచారం చేశారు. ప్రజలనాడీ పట్టుకునే ప్రయత్నం చేశారు. దీనికితోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుందామని చూశారు. తొలి రెండు రౌండ్లలో ఓటరునాడీ కనిపిస్తోంది.. కానీ అదీ కొనసాగుతుందా.. లేదో చూడాలీ
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications