కేసీఆర్ ఇషారా చేస్తే భరతం పడతాం.!బీజేపి చిల్లర రాజకీయాలు.!గులాబీ ఎమ్మెల్యేల కౌంటర్.!
హైదరాబాద్ : బీజేపి, టీఆర్ఎస్ నేతలపై మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. సీఎం చంద్రశేఖర్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన బీజేపి నేతలు బండి సంజయ్, ఎంపీ అరవింద్ లకు ఘాటుగా సమాధానం ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సైది రెడ్డి. బీజేపీ నేతలుబండి సంజయ్, అరవింద్ సభ్యత సంస్కారాలు లేకుండా మాట్లాడుతున్నారని, అరవింద్ ఎంపీ అన్న అంశాన్ని మరచిపోయి బజారు భాష వాడుతున్నారని బాల్క సుమన్ మండి పడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు అన్ని విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారని, అందకు సమాధానంగా బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ శృతిమించి మాట్లాడితే తెలంగాణ రైతులు బట్టలూడ దీసి కొడతారని హెచ్చరించారు

ప్రజలే బీజేపి నేతల నాలుకలు చీరేస్తారు.. బీజేపి నేతలకు టీఆర్ఎస్ నేతల హెచ్చరికలు
అంతే కాకుండా తెలంగాణ రైతుల మీద కేంద్రం, బీజేపీ కక్ష కట్టినట్టు కనిపిస్తోందని, అసలు విషయాల మీద మాట్లాడకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును ఏక వచనంతో సంభోదిస్తున్నారని, అరవింద్ కండ కావరం తో మాట్లాడుతున్నారని, తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. పసుపు బోర్డు తేనోడు ప్రపంచ విషయాలు మాట్లాడుతున్నాడని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని లొట్టపీసు చట్టమన్న అరవింద్ ను దళిత గిరిజన ఆదివాసీలు బట్టలూడ దీసి కొట్టడం ఖాయమని గులాబీ ప్రజా ప్రతినిదులు మండిపడ్డారు.

కేసీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నారు..?అరవింద్, సంజయ్ లను ప్రశ్నించిన టీఆర్ఎస్ నేతలు
అర్థం పర్థం లేకుండా పొంతన లేకుండా మాట్లాడుతున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని, తెలంగాణ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని, చంద్రశేఖర్ రావు భాష గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ ఒక సారి వెనక్కి తిరిగి చూసుకోవాలని హితవు పలికారు. థర్డ్ క్లాస్ నేతలుగా బీజేపీ ఎంపీలు మారిపోయారని, రైతులే బీజేపీ నేతల నాలుకలు చీరేస్తారని ధ్వజమెత్తారు. ఏడేళ్ళ కింద తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండే, ఇపుడు ఎట్లా ఉంది బీజేపీ నేతలకు తెలియదా అని, చంద్రశేఖర్ రావు చిత్త శుద్ధిని శంకిస్తారా అని, చంద్రవేఖర్ రావు ఉద్యమం చేసినపుడు అరవింద్, బండి ఎక్కడున్నారని ప్రశ్నించారు. సీఎం ఒక్క ఇషారా చేస్తే వారి భరతం పడతామని హెచ్చరించారు.

అభివృద్దిలో గుజరాత్ ను మించిపోతుందన్న ఈర్శ్య.. అందుకే తెలంగాణపై వివక్ష అన్న గులాబీ ఎమ్మెల్యేలు
చంద్రశేఖర్ రావు సహనంతో ఉన్నారు కాబట్టి వారు బతికి పోతున్నారని, ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి బండి సంజయ్ కి గాని, అర్వింద్ కు గానీ లేదని మండిపడ్డారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం బీజేపీ ప్రయత్నిస్తోందని, బీజేపి ఆటలు సాగనివ్వబోమని, అభివృద్దిలో తెలంగాణ గుజరాత్ ను దాటి పోతుందన్న అక్కసు తోనే బీజేపీ తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ రావును ఒకటంటె బీజేపీని పది అంటామని బాల్క సుమన్, సైది రెడ్డి విరుచుకు పడ్డారు.

బీజేపీ నేతలు తమ తీరు మార్చుకోవాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్న బాల్క సుమన్
కేంద్రం వ్యవసాయం మీద వార్షిక ప్రణాళిక ప్రకటించేలా బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఒత్తిడి తేవాలని, ప్రదాని మోదీ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని సూచించారు. బీజేపీ లో విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ అంటే గౌరవం ఉండేదని, ఇపుడు బీజేపీ కంపు నేతలతో నిండి పోయిందని, తెలంగాణకు పట్టిన శని బీజేపీ అని, బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో నడవవు అని హెచ్చరించారు. మేధావులు బీజేపీ నేతల భాషను గమనించాలని, బీజేపీ నేతలు తమ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని, తెలంగాణకు మేలు చేయని బీజేపీ ఎంపీ లు దద్దమ్మలు కాక మరేమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications