హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిపై అమిత్ షా, సిఎంలకు గ్రీటింగ్స్, మజ్లిస్‌పై కిషన్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కోసం తొలుత తీర్మానం చేసింది బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురువారం అన్నారు. సికింద్రాబాదులోని ఇంపీరియల్ గార్డెన్స్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గ్రేటర్ హైదరాబాదు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం మొదట నుంచి కృషి చేసింది తమ పార్టీయే అన్నారు.

చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు బీజం చేసింది నాటి ఎన్డీయే ప్రభుత్వమన్నారు. గతంలో మూడు రాష్ట్రాలను బీజేపీ ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు కలసిమెలసి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ రాజకీయాలతో రాష్ట్ర విభజనలో లోపాలు తలెత్తాయన్నారు.

BJP

గతంలో తాము మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు అందరు మిఠాయిలు పంచుకున్నారన్నారు. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ప్రస్తుతం దేశాన్ని రక్షించేది మోడీ నేతృత్వంలోని బీజేపీయేనని, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ దక్షిణాదికి విస్తరింపజేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.

మజ్లిస్‌పై కిషన్ రెడ్డి నిప్పులు

మజ్లిస్ కారణంగా హైదరాబాదు అభివృద్ధిలో వెనుకబడిపోతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో హైదరాబాదుకు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అవార్డు వచ్చిందని, ఇప్పుడు మజ్లిస్ పాలనతో నగరానికి మురికి అంటుకుందన్నారు. కులమతాలకు అతీతంగా బీజేపీ పని చేస్తుందని మురళీధర రావు అన్నారు. మజ్లిస్ ఆగడాలను బీజేపీ అడ్డుకుంటుందన్నారు. హైదరాబాదు జాతీయ సమగ్రతకు చిహ్నమన్నారు.

బీజేపీలో చేరిన దినేష్ రెడ్డి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ భారతీయ జనతాపార్టీలో చేరారు. హైదరాబాదు పర్యటనలో ఉన్న అమిత్ షా వారిరువురికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీని దిలీప్ కుమార్ బీజేపీలో విలీనం చేశారు.

English summary
Bharatiya Janata Party chief Amit Shah on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X