అసద్ పై బీజేపీ అస్త్రం మాధవీలత - ఎవరీమె, ఎంపిక వెనుక..!!
కేంద్రంలోని మోదీ సర్కార్ హ్యాట్రిక్ విజయం పైన కన్నేసింది. ఈ సారి 400 సీట్లలో గెలుపు లక్ష్యంగా ఫిక్స్ చేసింది. ఇప్పటికే 195 మంది అభ్యర్దులతో తొలి జాబితా ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి 9 మందిని ఖరారు చేసింది. అనూహ్యంగా హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి మహిళా అభ్యర్ది మాధవీ లతను ప్రకటించింది. ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో అసద్ లాంటి బలమైన నేతపైన మధవీ లతను బీజేపీ ఎంపిక చేయటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
మాధవీలత పేరు ఖరారు: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లిస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్‌ల చైర్‌పర్సన్ మాధవీలతకు టికెట్ ఖరారు చేసింది. తొలుత హైదరాబాద్ స్థానంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలో నిలపాలని భావించినా మాధవీ లత వైపు పార్టీ మొగ్గు చూపింది.

ఎన్‌సీసీ క్యాడెట్‌గా, క్లాసికల్ సింగర్‌గా మాధవీలత గుర్తింపు తెచ్చుకున్నారు. మాధవీలత రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా పాతబస్తీ ప్రజలతో మమేకమై పేదలను ఆదుకుంటున్నారు.
ఇంటర్వ్యూలతో పాపులర్: మాధవీలత మహిళలు, హిందూ అంశాల పైన యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. సామాజిక కార్యకర్తగా త్రిపుల్ తలాక్‌పై అనేక ముస్లిం మహిళా సంఘాలతో కలిసి పనిచేశారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కౌంటర్‌గా ఇచ్చిన పలు ఇంటర్వ్యూలతో ఆమె పాపులర్ అయ్యారు. బీజేపీ ప్రతినిధిగా అసదుద్దీన్ విధానాలను తనదైన శైలిలో వ్యతిరేకించడంతో పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలు, పాలనా స్ఫూర్తితో బీజేపీలో చేరారు. తన లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో పలు ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుంటారు. హైందవ సంస్కృతి, సాంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఎంఐఎం ను ఓడిస్తారా: హింధూ ధర్మం, హిందూ సాంప్రదాయాలపై ఆమె మాట్లాడే మాటలు, ఇచ్చే ప్రసంగాలపై పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. పాతబస్తీలో ఏమైనా సమస్యలు వస్తే, వాటికి పరిష్కారం చూపించేవారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చేవారు. బీజేపీ ప్రతినిధిగా అసదుద్దీన్ విధానాలను తనదైన శైలిలో వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. ఎంఐఎం కంచుకోట పాతబస్తీలో తరుచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేవారు.
హైదరాబాద్ సీటు 1984 నుంచి నాలుగు దశాబ్దాలుగా ఒవైసీల అడ్డా. ఈసారి ఎలాగైనా ఎంఐఎంకు చెక్ పెట్టి, విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం అనూహ్యంగా మాధవీ లతకు ఛాన్స్ ఇచ్చింది. దీంతో, ప్రస్తుత ఎన్నికల్లో అసద్ ను మాధవీలత ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications