ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా
హైదరాబాద్: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ ఎస్సీ కులాలకు వెంటనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఎస్సీ మోర్చా బుధవారం ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టింది. ఎస్సీ మోర్చా నేత రాములు నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో బిజెపి శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి, శాసనమండలి పక్షనేత ఎన్ రాంచందర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా మాజీ ఎమ్మెల్యేలు, ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీలో అన్ని విధాలుగా నష్టపోతున్నారని సీఎం కేసీఆర్ పై బిజెపి నాయకులు దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రంలో స్థిర పడ్డ ఎస్సీ కులాలకు చెందిన వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications