వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ సభ నేపధ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేసిన ఆగంతకులు; టీఆర్ఎస్ పనేనన్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర నేటితో ముగియనుంది. వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయం వద్ద నేడు మధ్యాహ్నం పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

 బీజేపీ ఫ్లెక్సీలు చించేసిన అగంతకులు

బీజేపీ ఫ్లెక్సీలు చించేసిన అగంతకులు

ఇక వరంగల్ జిల్లాలో బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభను సక్సెస్ చేయాలని బిజెపి శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఇక బీజేపీ సభను అడ్డుకోవాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బిజెపి బహిరంగ సభ నేపథ్యంలో వరంగల్ మహానగరంలో బిజెపి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. అయితే ఇది టీఆర్ఎస్ నాయకుల పనేనని బిజెపి నాయకులు మండిపడుతున్నారు.

కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్న టీఆర్ఎస్

కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్న టీఆర్ఎస్


బిజెపి సభను విఫలం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేశారని, కోర్టు సభకు అనుమతి ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోక టిఆర్ఎస్ నాయకులు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికే చెప్పులు మోస్తున్న బండి సంజయ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఆయన వరంగల్ పాదయాత్రను వ్యతిరేకించారు. ఇక ఇప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన నేపథ్యంలో పోలీసులు బండి సంజయ్ పాదయాత్ర కు సెక్యూరిటీ కల్పిస్తున్నారు.

వరంగల్ నగరంలో బండి సంజ్జయ్ పాదయాత్ర ముగింపు... టెన్షన్

వరంగల్ నగరంలో బండి సంజ్జయ్ పాదయాత్ర ముగింపు... టెన్షన్


తమ బలాన్ని చాటుకోవడానికి బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఓరుగల్లును కాషాయ జెండాలతో నింపేశారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు, బండి సంజయ్ కి స్వాగతం పలుకుతూ భారీగా కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టారు. ఇక అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వీటిని చించడం బిజెపి నాయకులు ఆగ్రహానికి కారణంగా మారింది. ఇక ఈరోజు మధ్యాహ్నం వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో వరంగల్ నగరంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

English summary
BJP Flexies arranged for bjp meeting in warangal were torn down by unknown persons late last night. BJP leaders are angry that it is done by TRS leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X