బీజేపీ బకరా చేసింది.. ఆధారాలివే; కాంగ్రెస్ సంచలన పోస్ట్
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేళ బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బిజెపి తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, తెలంగాణకు బిజెపి గాడిద గుడ్డు ఇచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. బిజెపి తెలంగాణ ప్రజలను బకరా చేసిందని జరిగింది ఏంటో తెలుసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కూడా సంచలన పోస్టులు పెడుతుంది.
నిత్యవసర వస్తువుల ధరలు మూడు రెట్లు పెరుగుదల
బిజెపి హయాంలో నిత్యవసర వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయని కాంగ్రెస్ పేర్కొంది. 45 సంవత్సరాలలో అత్యధిక నిరుద్యోగాన్ని చూస్తున్నామని, 20 కోట్ల ఉద్యోగాల జాడలేదు అని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆరోపించింది. రైతుల సగటు అప్పు 50% పెరిగిందని, లక్షకు పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని బిజెపి ప్రజలను బకరా చేసిందని వ్యాఖ్యానించింది.

కుటుంబ అప్పులు అత్యధికంగా 39 శాతానికి
బిజెపి హయాంలో కుటుంబ అప్పులు అత్యధికంగా 39 శాతానికి పెరిగాయని పేర్కొంది. కార్పొరేట్ దోస్తులకు ₹16 లక్షల కోట్ల బిజినెస్ లోన్ల మాఫీ చేసిందని, సామాన్య ప్రజలకు మాత్రం చేసింది సున్నా అంటూ టార్గెట్ చేసింది 2015 నుండి నల్లధనం మూడు రెట్లు పెరిగిందని, అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి అది జాడే లేదని వెల్లడించింది.
పెట్రోల్, గ్యాస్ ధరల బాదుడు
ఇక పెట్రోల్ ధర 2014లో 68 రూపాయలు ఉంటే, 2024లో 109 రూపాయలకు చేరిందని పేర్కొంది. గ్యాస్ సిలిండర్ ధర 2014లో 410 రూపాయలు ఉంటే, 2024లో 1200 రూపాయలకు చేరిందని వెల్లడించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల బాదుడు కొనసాగుతుందని పేర్కొంది. ఎలెక్టోరల్ బాండ్ల రూపంలో 3.8 లక్షల కోట్ల కుంభకోణం బిజెపి చేసింది అని పేర్కొంది.
పదేళ్లుగా మనల్ని బకరా చేస్తున్న బీజేపీ
సీబీఐ, ఈడి, ఐటీ దాడులతో హఫ్తా వసూల్ చేస్తున్నారని, పదేళ్లుగా మనల్ని బకరా చేసిన వాళ్ళకి బుద్ధి చెబుదామని, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టమని కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఈ మేరకు ఈ అన్ని అంశాలతో ఆసక్తికరమైన వీడియోను చేసి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది.












Click it and Unblock the Notifications