ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ పై బీజేపీ వ్యూహాత్మక మౌనం?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బిజెపి వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నట్టు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ పై వరుసగా కేసులు నమోదవుతున్నా, ఏకంగా తాజాగా బిజెపి అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ముంబై పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైనా బిజెపి నేతలు ఎవరూ పట్టించుకోకపోవడంపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ కరడు గట్టిన హిందుత్వవాది . సహజంగా బిజెపిలో పని చేసే వారంతా హిందుత్వ వాదులే అయినప్పటికీ, రాజాసింగ్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి మత విశ్వాసాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

రాజాసింగ్ మత విద్వేషాలను రగిలించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనపై అనేక కేసులు నమోదు కాగా, గతంలో హైదరాబాద్ కు వివాదాస్పద కమెడియన్ మునావర్ ఫారుఖీ రావడానికి అనుమతించిన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ, మహమ్మద్ ప్రవక్త పై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆయనపై పిడి యాక్ట్ ను నమోదు చేసి జైలుకు పంపించారు.
ఈ క్రమంలో రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బిజెపి ప్రకటించింది. ఆపై బెయిల్ పై బయటకు వచ్చిన రాజాసింగ్ తనపై పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా బిజెపి నేతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక తాజాగా బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్రలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేయడంతో రాజాసింగ్ విషయంలో బిజెపి ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అన్న చర్చ జరుగుతుంది. పార్టీకి రాజాసింగ్ వద్దేమో అని అంతా భావిస్తున్నారు.

ముంబైలో జనవరి 29వ తేదీన జరిగిన సభలో రాజా సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, లవ్ జిహాద్ గురించి 30 నిమిషాల పాటు ప్రసంగం చేసిన రాజాసింగ్ మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ముస్లింలు నిర్వహించే షాపుల నుంచి ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయకూడదని ప్రతి హిందువును కోరుతున్నట్టు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సైతం, మతవిద్వేషాలకు కారణంగా ఉన్నాయని పోలీసులు రాజాసింగ్ పై కేసు పెట్టారు.
అయితే పీడీ యాక్ట్ పై రాజాసింగ్ జైలుకు వెళ్లి, తిరిగి బయటకు వచ్చిన క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని తాజాగా మళ్లీ ఆయనపై కేసు నమోదు చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలోనే రాజాసింగ్ తలనొప్పి వద్దని పార్టీలో నేతలు సస్పెన్షన్ ఎత్తివేత గురించి ఆలోచించకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications