మోడీ నోట్ల రద్దు ఎఫెక్ట్: 'బ్యాంక్ ఖాతాల వివరాలు బయటపెట్టగలరా'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/భువనగిరి: భువనగిరిలో రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా సదస్సుకు పార్టీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ హాజరయ్యారు.

అంతకుముందు అక్కడ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనిని లక్ష్మణ్ ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులుగా పీవీ శ్యాం సుందర రావు ప్రమాణ స్వీకారం చేశారు.

 BJP Laxman challenges Opposition

విపక్ష నేతలకు లక్ష్మణ్ ప్రశ్న

రాష్ట్రానికి చెందిన పలువురు విపక్ష నాయకులు నవంబర్ 1వ తేదీ నుంచి తమ బ్యాంకు ఖాతాల వివరాలను బయటపెట్టగలరా అని డాక్టర్ కె లక్ష్మణ్ అంతకుముందు రోజు సవాల్ విసిరారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నవంబర్ 8వ తేదీ తర్వాత నిర్వహించిన బ్యాంకు లావాదేవీలను పార్టీకి సమర్పించాలని జాతీయ అధ్యక్షులు అమిత్ షా కోరారని చెప్పారు.

ఈ ప్రయత్నాన్ని కొన్ని పార్టీలు విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. గురువారం నుంచి అన్ని జిల్లాలు, మండలాలలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. కాగా, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ తమ అకౌంట్ వివరాలు వెల్లడించాలని బీజేపీ చెప్పిన విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana BJP State president Laxman challenges Opposition.
Please Wait while comments are loading...