హరీష్‌రావు కోసం KCRపై ఈటెల రాజేందర్ మైండ్‌గేమ్?
తెలంగాణలో పాగావేయాలనే ధృఢనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ అందుకు తగ్గ వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ నుంచే తాను బరిలోకి దిగుతున్నట్లు ఒకప్పటి ఆయన సహచరుడు, ప్రస్తుత బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించిన ఈటెలకు పార్టీ అధిష్టానం ''ఆపరేషన్ ఆక ర్ష్'' బాధ్యతలు అప్పగించింది.

పశ్చిమబెంగాల్ ను పునరావృతం చేయాలనే పట్టుదలతో..
పశ్చిమబెంగాల్ తరహా ఎన్నికలను ఇక్కడ పునరావృతం చేస్తామని, మమతా బెనర్జీని ఓడించినట్లుగా కేసీఆర్‌పై సుబేందు అధికారిలా తాను మారతానంటూ ఈటెల వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై వరుసగా రెండుసార్లు పోటీచేసి ఓటమిపాలైన వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించిన వంటేరు టీఆర్ఎస్‌లో ఉండటంవల్ల కేసీఆర్ ప్రచారానికి వెళ్లకపోయినా గెలుస్తారు అనే నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. అన్నిరకాలుగా నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది.

బీజేపీ, ఈటెల సంయుక్తంగా మైండ్ గేమ్
గజ్వేల్
నుంచి
పోటీ
ప్రకటన
ద్వారా
బీజేపీ,
ఈటెల
రాజేందర్
టీఆర్ఎస్‌పై,
కేసీఆర్‌పై
మైండ్
గేమ్
ఆడినట్లుగా
రాజకీయ
విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.
తన
ప్రకటనతో
ఈటెల
కేసీఆర్
ను
ఇరుకున
పెట్టారని,
ముఖ్యమంత్రి
కేసీఆర్
నియోజకవర్గం
మారతారనే
అంతర్గత
సమాచారం
అందడంవల్లే
రాజేందర్
ఈ
ప్రకటన
చేసినట్లుగా
టీఆర్
ఎస్
వర్గాలు
భావిస్తున్నాయి.
వంటేరును
అభ్యర్థిగా
నిలబెట్టి
కేసీఆర్
సిద్ధిపేటకు
వెళుతున్నారంటూ
వార్తలు
వచ్చాయి.

కేసీఆర్ ను మానసికంగా ఓడించాలని.3
కేసీఆర్ పై మానసికంగా గెలుపొందడం కోసం ఈ ప్రకటన చేశారని, దీంతో నియోజకవర్గం మారలేని పరిస్థితిని ముఖ్యమంత్రికి కల్పించినట్లవుతుందనేది బీజేపీ అభిప్రాయంగా ఉందంటున్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఈటెలపై విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి కల్పించాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది. గజ్వేల్ లో కూడా ఈటెలకు గట్టి పట్టుంది. ఇప్పటి నుంచే తాను పని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచే ఈటెల తన వ్యాపారాన్ని ప్రారంభించారు. కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేస్తే ఇతర నియోజకవర్గాలపై దృష్టిపెట్టరని, ముందు తాను గెలుపొందడానికే చూస్తారని, ఈ ప్రభావం మొత్తం పార్టీపై పడుతుందనే అభిప్రాయం ఉంది.

హరీష్ రావును గట్టెక్కించాలని..
లోతుగా
విశ్లేషణ
చేస్తే
తన
సన్నిహిత
మిత్రుడు
హరీష్‌రావును
గట్టెక్కించేందుకే
గజ్వేల్
నుంచి
పోటీ
చేస్తానని
ఈటెల
ప్రకటించినట్లు
సీనియర్
రాజకీయవేత్తలు
సైతం
అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్
సిద్దిపేట
నుంచి
పోటీ
చేస్తే
హరీశ్‌రావు
దుబ్బాక
లేదా
సంగారెడ్డి
నుంచి
పోటీ
చేయాల్సి
రావచ్చు.
అందుకే
గజ్వేల్
నుంచి
పోటీ
చేస్తానని
ఈటెల
ప్రకటించి
ముఖ్యమంత్రి
కేసీఆర్
పై
ఒత్తిడి
పెంచారు.
రాజకీయంగా
వ్యూహ
ప్రతివ్యూహాల్లో
గండర
గండడుగా
పేరు
తెచ్చుకున్న
తెలంగాణ
ముఖ్యమంత్రి
కేసీఆర్
ను
ఓడించడం
అంత
సులభం
కాదని,
దీనికి
ప్రతిగా
ఆయన
ఇప్పటికే
ఒక
వ్యూహాన్ని
సిద్ధం
చేశారని
తెలంగాణ
రాష్ట్ర
సమితి
శ్రేణులు
చెబుతున్నాయి.
ఈటెల
భావించినట్లుగా
ఒకవేళ
కేసీఆర్
గజ్వేల్
నుంచే
బరిలోకి
దిగితే
తెలంగాణ
రాజకీయం
మొత్తం
ఒక్కసారిగా
వేడెక్కుతుందని
విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.