మతిలేకుండా, అప్పుడేమైంది: ప్రకాశ్ రాజ్, పవన్‌లపై బీజేపీ నేత విమర్శలు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేత కృష్ణసాగర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరో నటుడు ప్రకాశ్ రాజ్ పైన సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల బీజేపీపై ప్రకాశ్ రాజ్ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పవన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కృష్ణసాగర్ స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు, కేసీఆర్ కుటుంబంపై పవన్ అనేక వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్‌ను పవన్ పొగడటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పవన్ తెరాస బీ టీం అని, అధికార పార్టీ వ్యతిరేక ఓటును చీల్చడానికి తెరాస ప్రయోగిస్తున్న అస్త్రం అన్నారు.

BJP leader lashes out at Actors Pawan Kalyan and Prakash raj

ఏపీలో చంద్రబాబును, తెలంగాణలో కేసీఆర్‌ను పొగడటం అంటే ప్యాకేజీల పార్టీగా కనబడుతోందన్నారు. ఏపీలో పెరుగన్నం తిని, తెలంగాణలో బిర్యానీలో తినడం రాజకీయం కాదన్నారు. దేశంలోనే తెలంగాణలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగాయని, దీనిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పవన్ యాత్రకు దిక్కు మొక్కు లేదని, ఆ యాత్రకు లక్ష్యం లేదన్నారు. ఆయన చేస్తున్న నినాదంలో అర్థం లేదన్నారు.

నటుడు ప్రకాశ్ రాజ్ పైన కూడా కృష్ణసాగర్ మండిపడ్డారు. రాజకీయం గురించి మాట్లాడుతున్నప్పుడు విజయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షాలు హిందువులు కాదంటే అర్థం ఉందా అన్నారు.

గౌరీ లంకేష్ మృతి పట్ల స్పందించకపోతే హిందువు కాదా అని ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ మతిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేరళలో 19 మంది ఆరెస్సెస్ యువకులు చనిపోతే ప్రకాశ్ రాజ్‌కు బాధ అనిపించలేదా అని నిలదీశారు. ఆయన ద్వేషంతో మాట్లాడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+