• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీలో 'ఈటల' చిచ్చు-ఉప్పెన తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరిక-అవసరమైతే ఇండిపెండెంట్‌గా బరిలోకి

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి ఈటల ఇంకా బీజేపీలో చేరనే లేదు... అప్పుడే ఆ పార్టీలో చిచ్చు మొదలైంది. ఈటల బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో హుజురాబాద్‌లోని స్థానిక బీజేపీ నాయకత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేత,హుజురాబాద్ నుంచి గతంలో రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన పెద్దిరెడ్డి ఈటల చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 30 ఏళ్లుగా అక్కడ రాజకీయం చేస్తున్న తనను సంప్రదించకుండానే ఈటలను చేర్చుకునే ప్రయత్నాలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ఈటలను బీజేపీలో చేర్చుకుంటే ఉప్పెన తప్పదని హెచ్చరించారు.

అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని ఎలా చేర్చుకుంటారు : పెద్దిరెడ్డి

అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని ఎలా చేర్చుకుంటారు : పెద్దిరెడ్డి

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక విషయం మీడియా ద్వారా,కొంతమంది మిత్రుల ద్వారా తనకు తెలిసిందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఏ బీజేపీ నాయకుడు తనకు దీనిపై సమాచారం ఇవ్వలేదన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి ఈటలతో మంతనాలు జరిపిన నేతలకు.. ఆ విషయం తనతో చెప్పేందుకు ఏం బాధ అని ప్రశ్నించారు.ఈటల చేరిక విషయంపై తనను సంప్రదించకపోవడం శోచనీయం అన్నారు. ఈటల చేరిక విషయంలో బీజేపీ తొందరపడుతోందని అన్నారు.ఒక సైద్దాంతిక భూమిక కలిగిన బీజేపీ అవినీతి ఆరోపణలు ఉన్న నేతను పార్టీలో ఎలా చేర్చుకుంటుందని ప్రశ్నించారు. రాముడి భూములు ఆక్రమించినట్లుగా ఈటలపై ఆరోపణలున్నాయని... ఆ విచారణ పూర్తయ్యేంతవరకు ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా-పెద్దిరెడ్డి

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా-పెద్దిరెడ్డి


ఈటల చేరిక విషయంలో హుజురాబాద్‌లోని పార్టీ ఇన్‌చార్జిని,కన్వీనర్‌ను,పట్టణ అధ్యక్షుడిని... ఇలా ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. నిన్న,మొన్నటిదాకా అక్కడి బీజేపీ కేడర్ ఈటల పైనే పోరాటం చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడింత హడావుడిగా,ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను నాలుగు పర్యాయాలు అక్కడినుంచి పోటీ చేశానని... రెండుసార్లు మంత్రిగా పనిచేశానని గుర్తుచేశారు. అలాంటి తనను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని వాపోయారు. ఒకవేళ ఈటల బీజేపీలో చేరితే తాను హుజురాబాద్ నుంచి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానన్నారు.

Recommended Video

Corona పై అవగాహన లేనోళ్లు Task Force కమిటీ లో ఉన్నారు - Revanth Reddy
ఈటలకు గ్రీన్ సిగ్నల్...

ఈటలకు గ్రీన్ సిగ్నల్...

మరోవైపు ఈటల చేరికకు బీజేపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌గా భేటీ అయి చర్చించినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈటల బీజేపీలో చేరే తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

English summary
BJP senior leader Peddireddy strongly opposed Etela Rajender joining with BJP.He said that he came to know about the joining of Etela Rajender in the BJP through the media and some friends. So far no BJP leader has informed him about this. To the leaders who came on a special flight from Delhi and negotiated with Etela .. he questioned why they have not informed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X