Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ చీఫ్ కు తేల్చి చెప్పేసిన రాములమ్మ - వాట్ నెక్స్ట్..!!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్దుల ఖరారు పైన కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్దుల ఎంపిక పూర్తి కావటంతో ప్రచారం మొదలు పెట్టి..మేనిఫెస్టో పైన ఫోకస్ చేసింది. ఈ సమయంలోనే బీజేపీలో కొంత కాలంగా అసంతృప్తి తో ఉన్న విజయశాంతి తాజాగా పార్టీ చీఫ్ నడ్డా ముందు తన ఆలోచన బయట పెట్టారు.

మారుతున్న లెక్కలు : ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలే ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల గ్యాప్ తో రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణకు సంబంధించి వరాలు ప్రకటించారు.

BJP leader Vijayasanthi Expecting Malakjgiri Loksabha seat in next Elections, Disucssions with JP Nadda

ప్రధాని సభకు కొందరు పార్టీ ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అని తొలుత భావించిన ఎన్నికల సమరం ఇప్పుడు మారినట్లు కనిపిస్తోది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించటం పైన కొందరు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. కొంత కాలంగా పార్టీ వ్యవహారాల పైన అసంతృప్తిగా ఉన్న ఫైర్ బ్రాండ్ విజయ శాంతి తాజాగా పార్టీ చీఫ్ నడ్డాతో సమావేశమయ్యారు.

ఎంపీగా పోటీ చేయాలని : పార్టీ వ్యవహారాలపైన చర్చించారు. వచ్చే ఎన్నికల్లో తన పోటీ పైన నడ్డా ముందు కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. విజయశాంతి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు. మల్కాజ్ గిరి స్థానం కేటాయించాలని అభ్యర్దించినట్లు సమాచారం. తనకు మల్కాజ్ గిరి స్థానం పైన స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇదే సీటు కోసం పార్టీ సీనియర్ నేత మురళీధర రావు ఆశలు పెట్టుకున్నారు. సీటు కోసం ఆయన ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.

అయితే, ముందుగా అసెంబ్లీ బరిలోకి దిగాలని విజయశాంతికి పార్టీ చీఫ్ నడ్డా సూచించినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం పని చేయాలని కోరినట్లుగా సమాచారం. లోక్ సభ సీటు పైన పార్టీలో చర్చించాల్సి ఉంటుందని చెప్పారని తెలుస్తోంది.

BJP leader Vijayasanthi Expecting Malakjgiri Loksabha seat in next Elections, Disucssions with JP Nadda

రాములమ్మ నెక్స్ట్ స్టెప్ : బీజేపీ అసెంబ్లీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు కొనసాగుతోంది. విజయశాంతి గతంలో ఎంపీగా పని చేసి ఉండటంతో..వచ్చే ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్దిగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఇప్పటికే మెదక్ నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్దులు ఖరారరయ్యారు. ఇక..విజయశాంతి తాను లోక్ సభకు పోటీ చేయాలని తేల్చి చెప్పటంతో..ఆ దిశగా స్పష్టమైన హామీ వస్తేనే తిరిగి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

తాజాగా పార్టీలో అసంతృప్తితో ఉన్న వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు విజయశాంతి డిమాండ్ స్పష్టం కావటంతో పార్టీ నుంచి ఎటువంటి హమీ ఇస్తారు.. ఇప్పుడు విజయశాంతి తదుపరి నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+