కేసీఆర్ పిరికిపంద.. కాలం చెల్లింది.. దేవుడు కూడా కాపాడలేదు.. టీఆర్ఎస్‌పై ఈటల విసుర్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఒక పిరికిపంద అంటూ మండిపడ్డారు. నీరో చక్రవర్తి పాలనను తలిపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దేదించేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. నిరుద్యోగుల కలలను కల్లలుగా మిగిల్చిన వ్యక్తి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల నోటిఫికేన్లను వెంటనే విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు

టీఆర్ఎస్ సర్కార్‌కు కాలం చెల్లింది..
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించటానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కలసిరావాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో ఈటల పాల్గొన్నారు. ఎన్నికల కోసమే నిరుద్యోగులను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని దుయ్యబటటారు. టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కుప్పకూలితే మళ్లా అధికారంలోకి వచ్చే ఆసార్కం లేదని పేర్కొన్నారు. పిరికిపంద కేసీఆర్‌ను సాగనంపేందుకు ప్రజలు నడుంకట్టాలన్నారు.

కేసీఆర్‌ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు..
తెలంగాణ యువత ఆశలను ఆడియాశలు చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అంటూ ఈటల మండిపడ్డారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు . కరోనా సమయంలో కూడా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోగా.. ఫీల్డ్ అసిస్టెంట్ల నోట్లో మట్టికొట్టిన రాక్షసుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తొలగించాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో కేసీఆర్‌ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై ఎగరబోయేది కాషాయజెండానే అని ఈటల స్పష్టం చేశారు

ఏడాదిలో 150 రోజులు ఫాంహౌస్‌లోనే సీఎం ..
వడ్లను కొనమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదన్నారు ఈటల రాజేందర్ . ఉప్పుడు బియ్యం మాత్రమే కొనమని చెప్పిందని గుర్తుచేశారు. తనను ఏ ప్రభుత్వం భయపెట్టలేదన్న కేసీఆర్.. కేంద్రం తన మెడమీద కత్తి పెట్టిందని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు . కొందరు పోలీసులు, అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా కాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఏడాదిలో 150 రోజులు ఫాంహౌస్ లోనే ఉండే ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ప్రజలను దగా చేస్తున్న కేసీఆర్‌కు వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచిన వారిని బేషరతుగా విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications