టెన్షన్.. టెన్షన్.. : అసెంబ్లీ వద్ద పోలీసులు-కిషన్ రెడ్డి వాగ్వివాదం
హైదరాబాద్ : విలీనమా..? విమోచనమా..? ఎవరి లెక్క వారిదే, ఎవరి అభిప్రాయాలు వారివే. సెప్టెంబర్ 17 వచ్చిందంటే చాలు.. తెలంగాణ రాజకీయాల్లో దీనిపైనే వాడి వేడి చర్చ. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీజేపీ నేతలకు మధ్య ఇప్పుడీ అంశం నిప్పు రాజేస్తుంది.
సెప్టెంబర్ 17ను విలీన దినంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో.. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇదే క్రమంలో బీజేపీ కార్యాలయంలో దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ వాదనను వినిపించారు బీజేపీ నేతలు.

అనంతరం హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న జాతీయ జెండాను ఎగిరేసుందుకు బయలుదేరారు నేతలు. అయితే బీజేపీ నేతలందరినీ అసెంబ్లీ గేటు దగ్గరే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లేందుకు బీజేపీ నేతలు పట్టుబట్టడంతో అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications