కేసీఆర్ దేశ్ కీ నేత అని హోర్డింగులు పెట్టుకోవటానికే ఢిల్లీలో మహాధర్నా: రఘునందన్ రావు
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రైతాంగం సాగుచేసిన యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని, దేశం మొత్తం ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా మహా ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్రానికి 24గంటలు డెడ్ లైన్ పెట్టిన కేసీఆర్
కేంద్రంలోని బిజెపి సిగ్గులేని రాజకీయాలు చేస్తుందని మండిపడిన కెసిఆర్ 24 గంటల డెడ్ లైన్ విధించారు. 24 గంటల్లోగా వరి ధాన్యం కొనుగోలు పై కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాలని తేల్చి చెప్పారు. లేదంటే కేంద్ర సర్కార్ ని విడిచిపెట్టేది లేదంటూ, మహాసంగ్రామం జరుగుతుందంటూ కేసీఆర్ తీవ్రస్థాయిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలు చెయ్యకుండా తెలంగాణా రైతాంగాన్ని కేంద్రం మోసం చేస్తుందని మండిపడ్డారు. దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని కెసీఆర్ డిమాండ్ చేశారు.

రాజకీయాల కోసమే కెసీఆర్ వడ్ల పంచాయితీ : ఎమ్మెల్యే రఘునందన్ రావు
సీఎం కేసీఆర్ కేంద్రంపై సాగిస్తున్న పోరాటం పై బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో మహాధర్నా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు తెలంగాణ రైతాంగం సాగుచేసిన వడ్లను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదే అంటూ తేల్చి చెబుతున్నారు. ఇక రాజకీయాల కోసమే కేసీఆర్ వడ్ల పంచాయితీ తెచ్చారని బిజెపి నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ రాష్ట్రంలోనూ లేని వడ్ల సమస్య తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందో ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు పై కేసీఆర్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని ఎమ్మెల్యే రఘునందన్ రావు తేల్చిచెప్పారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలతో కెసీఆర్ కు ఏమీ అర్ధం కాలేదని, హుజురాబాద్ ఉప ఎన్నికతో తెలంగాణ సీఎం కేసీఆర్ పని అయిపోయిందని అందరికీ అర్థమైందని ఆయన పేర్కొన్నారు. అసలు ధాన్యం కొనుగోలు పై కేసీఆర్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. పట్టుమని రెండు గంటలపాటు ధర్నా చేసే ఓపిక కూడా కెసిఆర్ కు లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.

కేసీఆర్ దేశ్ కీ నేత అని హోర్డింగులు పెట్టించుకోవడం కోసమే ఢిల్లీ దీక్ష
ఇక టిఆర్ఎస్ దీక్షలో పాల్గొన్న రాకేష్ టికాయత్ పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రఘునందన్ రావు గల్లీల వార్డు మెంబర్ గా గెలవలేని రాకేష్ టికాయత్ ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని సభ్యులు చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో జరిగింది రైతు దీక్ష కాదని పేర్కొన్న ఆయన, కెసిఆర్ దేశ్ కీ నేత అని హోర్డింగులు పెట్టించుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు.
వడ్లు కొనాలని ఐకేపీ సెంటర్ కు వెళ్లి ముచ్చట చెబుతావా? లేక ఢిల్లీ కి వెళ్లి దేశ్ కి నేత అని హోర్డింగులు పెట్టించుకుంటావా? అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు రైతుల కష్టాల గురించి ఆలోచించకుండా కేసీఆర్ రాజకీయం గురించి ఆలోచిస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications