కేసీఆర్.. శాసనసభకు ఇచ్చే గౌరవం ఇదేనా?: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్, బీఏసీలో మీవాళ్లేనా?
హైదరాబాద్: అసెంబ్లీ బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవడం సమంజసం కాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. స్పీకర్ అధికార పార్టీ కనుసన్నల్లో నడవబోరని ఆశించామని.. కానీ, బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.

బీజేపీని విస్మరిస్తారా?.. స్పీకర్, మంత్రి సమాధానం చెప్పాలి..
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. బీఏసీకి బీజేపీని పిలవకపోవడంపై స్పీకర్, సభా వ్యవహారాల మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో లోక్‌సత్తా నుంచి ఒకే ఎమ్మెల్యేగా జయప్రకాశ్ నారాయణ ఉంటే ఆయన్ను పిలిచారని రఘునందన్ రావు గుర్తు చేశారు.
సభా నియమ నిబంధనలను టీఆర్ఎస్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. మంగళవారం ఉదయం స్పీకర్‌ను కలిసి తమ నిరసన తెలియజేస్తామని తెలిపారు. సభ్యులకు ఉన్న హక్కులను గౌరవించాలన్నారు.

బీఏసీలో అంతా ఒకేతాను ముక్కలేనా?
అంతేగాక, అసెంబ్లీ ఆవరణలో ఉన్న మీడియా పాయింట్ ను పునరుద్ధరించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మీకు ఇష్టం ఉంటే పిలుస్తారు.. లేకుంటే పిలవరా? అని ప్రశ్నించారు. నియంతృత్వంగా సభను నడిపించాలని అర్థమవుతోందన్నారు. సభను ఎలా నడపాలో ఒకే తాను ముక్కలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కలిసి కూర్చోని రాసుకుంటే ఎలా ఉంటుందో తెలుసన్నారు. తమ హక్కుల్ని సాధించుకోవడానికి గాంధేయ మార్గంలో పోరాటం చేస్తామన్నారు.

సనసభకు కేసీఆర్ ఇచ్చే గౌరవం ఇదేనా?
శా
బీఏసీకి హాజరు కాకుండా సీఎం వెళ్లిపోయాడంటే ఆయనకు సభ పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని అన్నారు. సభా సంప్రదాయాలను గౌరవించాలని ముఖ్యమంత్రికి సూచించారు. అంతకుముందు మరో ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు రఘునందన్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా శాసనసభలో ప్రజల గొంతు వినిపించేవారు లేరని అన్నారు. సమస్యలు వినిపించాలని దుబ్బాక ప్రజలు తనను అసెంబ్లీకి పంపారన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ప్రజాసమస్యలపై పోరాడతామని, పీఆర్సీ, ఉద్యోగ సమస్యలపై నిలదీస్తామన్నారు.












Click it and Unblock the Notifications