కమిషన్ వద్ద కాళేశ్వరం గుట్టు విప్పిన ఈటల..!!

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పని చేసిన ఈటల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులపైన విచారణలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాదాపు 24 ప్రశ్నలకు ఈటల సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కాగా, ప్రాజెక్టు అంచనాలు.. నిధుల కేటాయింపు.. డిజైనింగ్ వంటి అంశాల విషయం లో కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు కీలకంగా మారనున్నాయి. ఇక, కేసీఆర్ విచారణకు ముందు ఈటల హాజరు కావటం.. ఇచ్చిన సమాచారం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన ఎంపీ ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. కాళేశ్వరంపై ఎంపీ ఈటలను జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. కాగా, ఈ విచారణ వేళ ఈటలను కమిషన్ సంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కేబినెట్‌ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని ఈటల చెప్పినట్లు తెలుస్తోంది. సాంకేతిక కమిటీ, కేబినెట్‌ కమిటీ సిఫార్సు మేరకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని వివరించారు. సీడబ్ల్యూసీ, మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా లొకేషన్ మార్పు జరిగిందని కమిషన్ కు వెల్లడించినట్లు సమాచారం. ప్రాజెక్టు లొకేషన్ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు జరిగిన విధానాన్ని వివరించారు.

BJP MP Etela Rajender Appear Before Kaleshwaram Commission Today

కాగా, నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ఈటల కమిషన్ కు విచారణ సమయంలో వెల్లడించారు. పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డీపీ ఆర్‌లో ఉందని గుర్తు చేసారు. పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయ లేదని చెప్పుకొచ్చారు. కానీ, వసూలు జరగలేదన్నారు. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపిం చిందా అని జస్టిస్‌ ఘోష్‌ ప్రశ్నించగా.. ఆ అంశాలన్ని నీటిపారుదల శాఖ కిందకే వస్తాయని ఈటల చెప్పినట్లు సమాచారం. ఇక.. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారమంతా కేసీఆర్‌, హరీశ్‌రావు వద్దే ఉందని ఈటల వెల్లడించినట్లు తెలుస్తోంది.

అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థికశాఖ పాత్ర పెద్దగా లేదని స్పష్టం చేసారు. ఆర్థికశాఖకు అన్ని విషయాలు తెలియవని చెప్పిన ఈటల.. కాళేశ్వరం ప్రాజెక్టులో తానేమీ చేయలేదు.. తన దగ్గర ఏం లేదని చెప్పారు.ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశార ని గుర్తు చేసారు. మంత్రివర్గ ఉపసంఘానికి హరీశ్ రావు ఛైర్మన్ గా ఉన్నారనే విషయాన్ని కమిషన్ వద్ద ఈటల చెప్పినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+