Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆపరేషన్ ఆకర్ష్: బీజేపీలో చేరికల జాబితాతో ఢిల్లీకి ఈటల, డీకే అరుణ; గులాబీపార్టీలో గుబులు!!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా ముందుకు వెళుతుంది. తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేస్తున్న బీజేపీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం మిషన్ తెలంగాణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బిజెపి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. ఒకపక్క ప్రజాక్షేత్రంలో విభిన్న కార్యక్రమాలతో ముందుకు సాగుతూనే, మరోపక్క ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్ధి పార్టీల నుండి బలమైన నాయకులను ఆకర్షించే పనిలో పడింది.

చేరికలపై చాప క్రింద నీరులా పనిచేసిన ఈటల రాజేందర్

చేరికలపై చాప క్రింద నీరులా పనిచేసిన ఈటల రాజేందర్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి, ఇతర పార్టీల నుండి బీజేపీ లోకి వచ్చేవారిని తీసుకురావడానికి జాతీయ నాయకత్వం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి కీలకంగా పని చేసి, పార్టీ గుట్టంతా తెలిసిన నేత కావడంతో టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులను తీసుకురావడానికి ఈటల రాజేందర్ కు బాధ్యత అప్పగించారు.

ఈ క్రమంలో ఈటల రాజేందర్ చాప కింద నీరులా చేరికల విషయంలో అసంతృప్తితో ఉన్న టిఆర్ఎస్ నాయకులతో మంతనాలు జరుపుతూనే, ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి కూడా అసంతృప్తులను బిజెపి బాట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

జిల్లాల వారీగా బీజేపీలో చేరే వారి జాబితా రెడీ..

జిల్లాల వారీగా బీజేపీలో చేరే వారి జాబితా రెడీ..

త్వరలో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఇప్పటికే అనేక మార్లు ప్రకటన చేసిన బిజెపి నాయకులు ఇక కీలక నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యే వారి లిస్టును చేరికల కమిటీ సిద్ధం చేసింది. ఇక ఈటల రాజేందర్ చేరికల కోసం పావులు కదుపుతూ ఎప్పటికప్పుడు చేరికలు కమిటీతో ఈ విషయాలను చర్చిస్తున్నారు. బిజెపిలో ఇతర పార్టీల నుండి వచ్చే వారిని చేర్చుకోవడం కోసం జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీని సైతం ఏర్పాటు చేసి చేరికలకు భారీ వ్యూహాన్ని రచించారు.

చేరికల కమిటీ కన్వీనర్ గా ఈటల.. చేరికల లిస్టులో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

చేరికల కమిటీ కన్వీనర్ గా ఈటల.. చేరికల లిస్టులో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

చేరికల కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్, చేరికల కమిటీ చైర్మన్‌గా బీజేపీ సీనియర్ నేత, నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించారు. కమిటీలో స్వామి గౌడ్, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, డీ రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుతోపాటు మరో ఇద్దరు సభ్యులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే జిల్లాల వారీగా బిజెపిలో చేరే వారి లిస్టును చేరికల కమిటీ సిద్ధం చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

హై కమాండ్ కు చేరికల జాబితా అందించనున్న ఈటల రాజేందర్, డీకే అరుణ

హై కమాండ్ కు చేరికల జాబితా అందించనున్న ఈటల రాజేందర్, డీకే అరుణ

ఇక చేరికల కమిటీ సిద్ధం చేసిన ఈ జాబితాను బిజెపి హైకమాండ్ కు చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఢిల్లీ వెళ్లి అందించనున్నారు. పార్టీ జాతీయ నేతల నుండి చేరికలకు పర్మిషన్ రాగానే ఆపరేషన్ ఆకర్ష్ ను భారీస్థాయిలో మొదలు పెట్టనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇక బీజేపీ లో చేరికల జాబితా రెడీ అయిందని వస్తున్న వార్తల నేపథ్యంలో మిగతా పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీలకు షాక్ ఇచ్చి వెళ్తున్న నాయకులు ఎవరు అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో బీజేపీలోకి చేరికలపై ఆందోళన నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+