రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి సంజయ్ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి: ప్రజలతో మమేకమవుతూ సాగుతోందిలా

|
Google Oneindia TeluguNews

వికారాబాద్: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వంద కిలోల కేక్ కట్ చేశారు. జులై 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

ప్రతిరోజూ సగటున 12 కిలోమీటర్లు

ప్రతిరోజూ సగటున 12 కిలోమీటర్లు

గత 9 రోజులుగా నిర్విరామంగా తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు బండి సంజయ్. పాతబస్తీ మొదలు గోషామహల్, నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పాదయాత్రను పూర్తి చేసిన బండి సంజయ్.. ప్రస్తుతం వికారాబాద్ నియోజకవర్గంలో యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు సగటున 12 కిలోమీటర్ల చొప్పున కాలినడకన గ్రామాల్లో పర్యటిస్తున్న బండి సంజయ్.. ప్రజలను కలుస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నారు.

బండి సంజయ్ ముందుకు ప్రజా సమస్యలు..

బండి సంజయ్ ముందుకు ప్రజా సమస్యలు..

పాదయాత్రలో బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. యువకులు, పిల్లలు, మహిళలు, వృద్ధులనే తేడా లేకుండా జనం సంజయ్‌ను కలిసేందుకు, ఆయనతో సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పాదయాత్రలో ప్రధానంగా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, పంట నష్ట పరిహారం అందకపోవడం, రైతు బీమా దరఖాస్తులో జాప్యం, పంట ఉత్పత్తికి మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ సౌలభ్యం లేకపోవడం, కౌలు రైతులకూ రైతు బంధు వర్తింపజేయాలనే అంశాలన ప్రజలు సంజయ్ దృష్టికొస్తున్నారు.

బండి సంజయ్ పాదయాత్రలో నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ, ఉపాధి లేక యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఎక్కువ వినతి పత్రాలు వచ్చాయి. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయించాలని, నిరుద్యోగ భ్రుతి ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని యువత పెద్ద ఎత్తున సంజయ్ ను కలిసి కోరుతోంది. కరోనాతో వేలాది కుటుంబాలు చితికిపోయిన అంశం కూడా సంజయ్ దృష్టికి వచ్చింది. అదే సమయంలో తమకు ఇళ్లు లేవని, డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదంటూ పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తున్నాయి.

ప్రజలతో మమేకమవుతూ సాగుతన్న బండి పాదయాత్ర

ప్రజలతో మమేకమవుతూ సాగుతన్న బండి పాదయాత్ర

ప్రభుత్వంపై పోరాడాలని తాము అండగా ఉంటామని సంజయ్ కు జనం మద్దతు పలుకుతున్నారు. ఒకవైపు ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే వాటి పరిష్కారమే ఎజెండాగా ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చే దిశగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నారు. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేసే విషయంలో బీజేపీ జాతీయ పార్టీ పూర్తి బాసటగా నిలుస్తోంది. కేంద్రం నుంచి పలువురు నేతలు రంగంలోకి దిగారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి సారథ్యంలో సహ ప్రముఖ్ లంకల దీపక్ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్ యాత్ర ఏర్పాట్లలో నిరంతరం శ్రమిస్తున్నారు.

గత 9 రోజులుగా బండి సంజయ్ వెంటే ఉంటూ ఆయనతో పాటు సంగ్రామ సైనికులు పాదయాత్ర చేస్తున్నారు. ప్రతిరోజు సగటున 500 మందికి తక్కువ కాకుండా బీజేపీ సంగ్రామ సైనికులు సంజయ్ వెంట నడుస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొనగా.. ఇటీవల పాదయాత్రలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొని.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

బండి యాత్రతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

బండి యాత్రతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీ శ్రేణుల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్త జోష్ కనబడుతోంది. పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ఆరంభ సభకు ఊహించని రీతిలో జనం తరలిరావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా బయటకు వచ్చి కాషాయా జెండా పట్టుకుని బండి సంజయ్ వెంట నడుస్తుండటంతో బీజేపీలో నాయకుల్లో జోష్ కన్పిస్తోంది. దీంతోపాటు పార్టీ సానుభూతిపరులు, ప్రజాస్వామ్యవాదులు, వివిధ సంఘాల నాయకులు సైతం సంజయ్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిస్తున్నారు.

బండి సంజయ్ కూడా ప్రజలు చెబుతున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇచ్చిన హామీలనే నెరవేర్చని కేసీఆర్ సర్కారు.. సాధ్యం కాని కొత్త హామీలు ఇస్తోందంటూ మండిపడుతున్నారు. ఆదివారం టీచర్స్ డే సందర్భంగా పలువురు టీచర్లకు బండి సంజయ్ సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలా మంది టీచర్లతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఉపాధ్యాయ వృత్తి అంటే తనకు గౌరవమని అన్నారు. తన తండ్రి కూడా ఒక టీచర్ అని, చిన్నప్పటి నుంచి దేశం, ధర్మం పట్ల ఆలోచించే విధానాన్ని తన తండ్రి వల్లనే నేర్చకున్నానని బండి సంజయ్ చెప్పారు. తన తండ్రి ఉపాధ్యాయుడు కాబట్టే మంచి క్రమశిక్షణతో ఈ స్థాయికి ఎదిగామని అన్నారు.

పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దే శక్తి ఉపాధ్యాయులకు ఉందన్నారు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో స్కూళ్ల డెవలప్‌మెంట్‌ను పట్టించుకోవడం లేదని, యువత చదువుకుంటే రాజకీయంగా జ్ఞానం పెరిగి తనపై తిరగబడతారని సీఎం కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. అందుకే గొర్రెలు, బర్రెలు ఇచ్చి మభ్యపెడుతున్నారని అన్నారు. బడుల బదులు బార్లు ఎక్కువైపోయాయని, రాష్ట్రంలో కిలోమీటర్‌‌కు ఒక వైన్‌ షాప్, బార్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ధైర్యం చెప్పే ఉపాధ్యాయులే భయపడితే సమాజంలో మరెవరూ ధైర్యంగా పోరాడలేరని బండి సంజయ్ అన్నారు. కానీ పీఆర్సీ విషయంలో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీచర్లకు సీఎం కేసీఆర్‌‌ ఫోన్‌ చేసి మరీ ఉపాధ్యాయ సంఘాలను రద్దు చేస్తానని బెదిరించారని ఆరోపించారు.

దీంతో టీచర్లు భయపడి టీచర్లు టీఆర్‌‌ఎస్‌కు ఓట్లు వేశారని అన్నారు. అయితే టీచర్లంటే సీఎం కేసీఆర్‌‌కు భయం ఉంది కాబట్టే ఎలక్షన్ డ్యూటీ వేయకుండా దూరంగా పెట్టారని గుర్తు చేశారు. సమాజాన్ని జాగృతం చేయాల్సింది టీచర్లేనని, వారికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు బండి సంజయ్.

English summary
BJP president Bandi Sanjay padayatra completed 100 kilometers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X