బీజేపీ అధ్యక్ష రేసులో ఆయనే... చిరంజీవిపైనా కిషన్ రెడ్డి ఏమన్నారంటే!

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధ్యక్ష పదవిపై, ఇటీవల చిరంజీవి తమ నివాసంలో సంక్రాంతి వేడుకలలో పాల్గొనటం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన కిషన్ రెడ్డి ఈ సమయంలో బిజెపి అధ్యక్ష పదవిపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపి అధ్యక్షుడు కావాలంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

బీజేపీ అధ్యక్ష రేసులో ఆయనే
రెండుసార్లు బిజెపి క్రియాశీలక సభ్యత్వం ఉంటే సరిపోతుందని ఆయన వెల్లడించారు. అంతేకాదు రెండుసార్లు బిజెపి గుర్తుపై పోటీ చేసినా సరిపోతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బిజెపి నుండి మల్కాజ్గిరి కి పోటీ చేసి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈటల రాజేందర్ కూడా బిజెపి అధ్యక్షుడు రేసులో ఉంటారని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

BJP presidential race What Kishan Reddy has to say about Chiranjeevi

నిర్ణయాధికారం అధిష్టానానిదే
ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో రాబోయే రోజుల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేందర్ అవుతారా అన్నది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని నిర్ణయించే విషయంలో పూర్తి నిర్ణయాధికారం అధిష్టానానికే ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో చిరంజీవి పాల్గొనడం పైన కూడా ఆయన స్పందించారు.

చిరంజీవితో సంబంధాలపై కిషన్ రెడ్డి
మెగాస్టార్ చిరంజీవితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆ సంబంధాల నేపథ్యంలో తాను పిలిస్తే తన మాట కాదనకుండా చిరంజీవి వస్తారని ఆయన అన్నారు. ఇద్దరు ఒకరిని ఒకరం కుటుంబ సభ్యులుగా భావిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్క చిరంజీవి మాత్రమే కాదు చాలామంది సినీ ప్రముఖులతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని చాలామంది పార్టీలో చేరి మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా అయ్యారని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో మరింత ఆసక్తి
తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టబోతున్నారు అన్నది అందరూ ఆసక్తిగా చూస్తున్న తరుణంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరింత ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+