వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా మీరేనా: కేసీఆర్‌పై బీజేపీ ఆగ్రహం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అధికార పార్టీ నేతలకే అవకాశం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మంగళవారం నాడు సచివాలయం ముందు బైఠాయించారు.

బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్ర రావు, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజసింగ్ రాథోడ్‌లు గంటసేపు సీ బ్లాక్ ముందు బైఠాయించారు.

ముఖ్యమంత్రిని కలవాలని వచ్చామని, లేకపోవడంతో కలవలేకపోయామన్నారు. నగరంలో ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్‌లో ఎమ్మెల్యేలందర్నీ భాగస్వాములను చేయాలన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేల అరెస్టు నేపథ్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ వర్గాలు దగ్ధం చేశాయి.

బీజేపీ

బీజేపీ

ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుని కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేఎల్సీ నేత లక్ష్మణ్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం సచివాలయానికి వచ్చారు.

బీజేపీ

బీజేపీ

అయితే సీఎం కేసీఆర్ వారికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలోని సి-బ్లాక్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

బీజేపీ

బీజేపీ

పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అంతక ముందు ఎమ్మెల్యే లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

బీజేపీ

బీజేపీ

నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవడం లేదని మండిపడ్డారు.

బీజేపీ

బీజేపీ

హైదరాబాద్ అభివృద్ధి విషయంలో జీహెచ్‌ఎంసీ ప్రదర్శిస్తోన్న తీరు ఎంత మాత్రం సరికాదని లక్ష్మణ్ ఆరోపించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరికీ అవకాశం కల్పించడం లేదన్నారు.

English summary
BJP protests outside UP Secretariat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X