రేవంత్‌కి అంత లేదు, ఓటుకు నోటు దొంగ: బిజెపి నేత సంచలనం, సెబాస్టియన్ ఇలా
తెలంగాణలో బిజెపి లేదన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందన్ రావు శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: తెలంగాణలో బిజెపి లేదన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందన్ రావు శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపిని విమర్శించేంత లేదన్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని రఘునందన్ రావు ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి బిజెపి గురించి మాట్లాడటం విడ్డూరమని చెప్పారు.

గతంలో బిజెపి, టిడిపి సమావేశాలు
గతంలో బిజెపి, టిడిపి సమావేశాలు చాలా జరిగాయని రఘునందన్ రావు అన్నారు. అప్పుడు ఎవరి డబ్బులతో రేవంత్ రెడ్డి వచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం కేసీఆర్ డబ్బులతో టిడిపి, బిజెపి సమావేశాలు పెట్టుకుంటున్నారని చెప్పడం విడ్డూరమన్నారు.

రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై సెబాస్టియన్
ఇదిలా ఉండగా ఓటుకు నోటు కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న టిడిపి నేత సెబాస్టియన్ రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించారు. అది రేవంత్ వ్యక్తిగతమని చెప్పారు. తాను పార్టీ మారేది లేదన్నారు.

బిజెపి అగ్రనేతలు ఇలా అన్నారుగా
కాగా, తెలంగాణలో టిడిపి లేదని బిజెపి అగ్రనేతలు అమిత్ షా, మురళీధర రావు వంటి వారు బహిరంగంగా చెప్పారని, మరి ఇప్పుడు రాష్ట్రంలో అదే బిజెపి నేతలతో టిడిపి నేతలు సమన్వయ భేటీని ఎలా నిర్వహిస్తారని రేవంత్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications