తెలంగాణాలో బీజేపీ రథయాత్రలు.. బండి సేన సిద్ధం.. ఇక సమర శంఖమే!!
తెలంగాణలో బీజేపీ రథయాత్రలకు రెడీ అవుతుంది. రథ యాత్రలతో తెలంగాణ ఎన్నికల సమరానికి బండి సంజయ్ టీమ్ సిద్ధమైంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఇప్పటికే చాలా పార్టీలు పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం ప్రయత్నం చేస్తుంటే, ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న బిజెపి వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. ఇక మరో కొత్త కార్యక్రమానికి బండి సేన సిద్ధమైందని తాజాగా ఢిల్లీ పర్యటన తర్వాత తెలుస్తుంది.

త్వరలో బీజేపీ రథయాత్రలు
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందే.. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరాల్సిందే అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర బిజెపి నేతలకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు ఏ విధంగా వెళ్లాలో వారికి ఉద్బోధించారు. పార్టీ నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం బిజెపి ఖాతాలో పడుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇక ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు చేరువ కావడం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుంది బిజెపి. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేసేలాగా బిజెపి రథయాత్రలు నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది .

ఏప్రిల్ మొదటివారం నుండి బీజేపీ రథయాత్రలు
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోకి బలంగా వెళ్లడం కోసం ప్రజా గోస బిజెపి భరోసా పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన బిజెపి నాయకులు స్థానిక ప్రజలతో మాట్లాడారు. స్థానిక సమస్యలపై మాట్లాడడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది? వంటి విషయాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు బీజేపీ రథయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లడానికి ఏప్రిల్ తొలి వారం నుండి పార్లమెంట్ల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర స్థానంలో రథయాత్రలు
దీని కోసం తెలంగాణ రాష్ట్రంలో ఐదు రథాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో రోజు యాత్ర చేపట్టేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తుంది బిజెపి. ప్రతి పార్లమెంట్ లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో బండి సంజయ్ రథయాత్రలో పాల్గొనేలా బిజెపి ప్లాన్ చేస్తుంది. అయితే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదు విడతల ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. ఇక ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఆరో విడత ప్రజా సంగ్రామయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. అయితే ప్రస్తుతం రథయాత్రలు కొనసాగించాలని బీజేపీ నిర్ణయం తీసుకోవడంతో బిజెపి నాయకత్వం ప్రజా సంగ్రామ యాత్ర స్థానంలో రథయాత్రలను నిర్వహించనుంది.

తెలంగాణాపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫోకస్
ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఫోకస్ చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో మకాం వేస్తారని పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి ఉంది. కర్ణాటక లోనూ బీజేపీ రథ యాత్రలతో ప్రజల్లోకి వెళ్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్ర నేతల మధ్య సమన్వయం పై ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ అమిత్ షా వారందరినీ ఏకతాటి మీద నడిపే ప్రయత్నం చేయనున్నట్టు సమాచారం.

బీజేపీ రథయాత్రలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో
ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక నేత ఇంట్లో సమావేశం కావాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. అంతేకాదు పార్టీలో చేరికలపైన కూడా దృష్టి సారించాలని, చేరికలను సమన్వయం చేసే బాధ్యత బన్సల్ కు అప్పగించినట్లు సమాచారం. మొత్తానికి జనం మనసు గెలుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న బిజెపి రథయాత్రలు ఏ మేరకు సక్సెస్ అవుతాయి అనేది వేచి చూడాలి.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications