బీజేపీ సెల్ఫ్ గోల్: ఆ తప్పే తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని చర్చ!!

తెలంగాణ రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికలు చిన్న చిన్న సంఘటనలు మినహాయించి ప్రశాంతంగానే కొనసాగాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, ఎలాగైనా బీఆర్ఎస్ ను గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీలు కంకణం కట్టుకొని మరీ ఎన్నికల పోరులో తలపడ్డాయి. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

ప్రస్తుతం స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలలో ఓటరు తీర్పు భద్రపరచబడి ఉంది. అయితే ఎన్నికల పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. మొత్తం 20 ఎగ్జిట్ పోల్స్ లో 17 ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యమని తేల్చి చెప్పాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వస్తాయని చెప్పినప్పటికీ, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ దూకుడును చూపించిందని తేల్చాయి.

BJP self goal: BJP has made mistake by removing bandi sanjay as telangana bjp chief!!

ఇదే సమయంలో బిజెపి పరిస్థితి పైన కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. బిజెపి చేసిన స్వయంకృత అపరాధం వల్లే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ తెలంగాణా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉన్నట్టు తర్వాత పార్టీ లేదని అంటున్నారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కి పార్టీ పగ్గాలు అప్పగించిన సమయంలో ఓ రేంజ్ లో బిజెపి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిందని, కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించడం వల్ల, ఆ స్థానంలో కిషన్ రెడ్డికి పట్టం కట్టడం వల్ల తెలంగాణలో బిజెపి దెబ్బతిందని చర్చ జరుగుతుంది.

బండి సంజయ్ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగితే, పార్టీ శ్రేణుల్లో జోష్ ఉండేదని, అలాగే కెసిఆర్ ను టార్గెట్ చేయడంలో బండి సంజయ్ చాలా బాగా సక్సెస్ అయ్యే వారని ప్రజలు చర్చిస్తున్నారు. బండి సంజయ్ ను మార్చి బిజెపి స్వయంకృత అపరాధం చేసిందని, దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బిజెపి మూడవ స్థానంలో ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+