బిజెపి నేత, సిక్కిం మాజీ గవర్నర్ వి రామారావు కన్నుమూత: కెసిఆర్, బాబు సంతాపం
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సిక్కిం మాజీ గవర్నర్ వి రామారావు(81) అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
1935, డిసెంబర్ 12న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రామారావు జన్మించారు. 1956లో జనసంఘ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బిజెపిలో జాతీయ నాయకుడిగా ఎదిగారు.

2002 నుంచి 2005 వరకు సిక్కిం రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. 1966, 1972, 1978, 1984లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో బిజెపి పక్ష నాయకుడిగానూ ఆయన సేవలందించారు. హైకోర్టు న్యాయవాదిగానూ ఆయన పని చేశారు.
రామారావు మృతి పట్ల గవర్నర్ నర్సింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్ రావు, చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ తోపాటు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications