రాజాసింగ్ రాజీనామా వేళ బీజేపీ ఊహించని నిర్ణయం,ఇక..!!
ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు కు రంగం సిద్దమైంది. పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ పైన బీజేపీ నాయకత్వం సీరియస్ గా ఉంది. పార్టీ పైన కొంత కాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వేళ రాజాసింగ్ రాజీనామా నిర్ణయం ప్రకటించారు. అధినాయకత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తాను వ్యవహరిస్తానని రాజా సింగ్ చెబుతూ వచ్చారు. తాజాగా రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసేందు కు బీజేపీ సిద్దమైంది. దీంతో, గోషామహల్ కు బై పోల్ ఖాయంగా కనిపిస్తోంది.
అనర్హత వేటు
బీజేపీలో వివాదాస్పదంగా మారిన రాజాసింగ్ వ్యవహారం పైన పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజాసింగ్ రాజీనామా.. వ్యాఖ్యల పైన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి నివేదిక పంపిన ట్లు సమాచారం. రాజాసింగ్ రాజీనామా లేఖను అధినాయకత్వానికి పంపారు. తాను బీజేపీ సింబల్ పైన ఎమ్మెల్యేగా గెలిచానని.. తన పదవి పైన అనర్హత వేటు కోరుతూ పార్టీ నేతలే స్పీకర్ కు లేఖ రాయాలని రాజాసింగ్ సూచించారు. ఆ తరువాత పార్టీ అధినాయకత్వం తన రాజీనామా లేఖ పైన స్పందన చూసిన తరువాత తన నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే, పార్టీ క్రమశిక్షణ ఉల్లఘించారనే కారణంతో రాజాసింగ్ విషయంలో మరో ఆలోచన వద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజీనామా ఆమోదానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

రాజాసింగ్ సిద్దం
ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర ముఖ్యులపై ఆరోపణలు గుప్పిస్తూ, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రత్యేకంగా లేఖ రాయనున్నట్టు సమాచారం. గతంలో పలు మార్లు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన సందర్భాల్లో రాజాసింగ్‌ను క్షమించినా, ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్ని వేళ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూనే ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాలని నిర్ణయించింది. బీజేపీ తన రాజీనామా ఆమోదిస్తే శివసేనలో చేరేందుకు రాజాసింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
స్పీకర్ నిర్ణయం పైనే
రాజాసింగ్ రాజీనామా ఆమోదించాలని బీజేపీ లేఖ వస్తే స్పీకర్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది. స్పీకర్ బీజేపీ లేఖ ఆధారంగా రాజాసింగ్ పైన అనర్హత వేటు వేస్తే... జూబ్లీహిల్స్ తో పాటుగానే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే.. జూబ్లీహిల్స్ బై పోల్ షెడ్యూల్ లోగా ఈ రాజీనామా లేఖ బీజేపీ నుంచి వచ్చి.. స్పీకర్ ఆమోదిస్తేనే ఇది సాధ్య పడుతుంది. అయితే, బీజేపీ నుంచి లేఖ వచ్చినా.. స్పీకర్ ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఇక్కడ కీలకం కానుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ.. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేయాలని బీజేపీ నిర్ణయించటం తో ఇక ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా పొలిటికల్ ఈక్వేషన్స్ ఆసక్తి కరంగా మారుతున్నాయి.
-
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు












Click it and Unblock the Notifications