తెలంగాణకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు.. ఎవరెవరో తెలుసా..!
తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అగ్రనేతలు అందుకనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అందులోభాగంగా పార్టీలోని కొంతమంది ముఖ్యులను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించింది అధిష్టానం. 40 మందికి ప్రచార బాధ్యతలు అప్పగించింది. వీరంతా షెడ్యూల్ వారీగా ఆయా ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటారు. జిల్లా కేంద్రాలతో పాటు పలు నియోజకవర్గాల్లో సభలు, సమావేశాల్లో పాల్గొనేలా రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. మిగతా నాయకుల షెడ్యూల్ పై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ తరపున ప్రచారం నిర్వహించడానికి ఎంపిక చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు, సీనియర్లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నాయకుల్లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, సినీనటి జీవితతో పాటు ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, హరిబాబు, పురందేశ్వరి తదితరులు ఉన్నారు.

40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే...
| నరేంద్ర మోడీ | జువల్ ఓరం |
| అమిత్ షా | రాంమాధవ్ |
| రాజ్‌నాథ్ సింగ్ | మురళీధర్ రావ్ |
| అరుణ్ జైట్లీ | హేమా మాలిని |
| సుష్మా స్వరాజ్ | బీఎల్ సంతోష్ |
| నితిన్ గడ్కరీ | పీకే కృష్ణదాస్ |
| రామ్‌లాల్ | సాయికుమార్ |
| యోగి ఆదిత్యానాథ్ | కె. లక్ష్మణ్ |
| రమణ్‌సింగ్ | బండారు దత్తాత్రేయ |
| రవిశంకర్ ప్రసాద్ | కిషన్ రెడ్డి |
| నిర్మలా సీతారామన్ | ఇంద్రసేనా రెడ్డి |
| ముక్తార్ అబ్బాస్ నఖ్వీ | స్వామి పరిపూర్ణానంద |
| డీవీ సదానంద గౌడ | ప్రేమేందర్ రెడ్డి |
| జగత్ ప్రకాశ్ నడ్డా | చింతా సాంబమూర్తి |
| స్మృతి ఇరానీ | జీవిత |
| పియూష్ గోయల్ | కన్నా లక్ష్మీనారాయణ |
| థావర్‌చంద్ గెహ్లాట్ | దగ్గుబాటి పురందేశ్వరి |
| పురుషోత్తమ్ రూపాలా | కె. హరిబాబు |
| సాధ్వి నిరంజన్ జ్యోతి | జీవీఎల్ నరసింహారావు |
| హన్స్‌రాజ్ గంగారామ్ | మంత్రి శ్రీనివాసులు |












Click it and Unblock the Notifications