Bandi Sanjay: ఫోన్ పోయింది.. బండి సంజయ్ ఫిర్యాదు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఆన్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ లోని తన నివాసంలో పోలీసులు తనను అరెస్ట్ చేసిన సమయంలోనే తన పోయిందని బండి సంజయ్ పేర్కొన్నారు. తన ఫోన్ లో కీలక సమాచారం ఉందని, దానిని వెంటనే వెతికి పెట్టాలని కోరారు. గత మంగళవారం రాత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటగా ముందస్తు అరెస్ట అని పేర్కొన్న పోలీసులు తర్వాత 10వ తరగతి హిందీ పేపర్ వైరల్ చేసినందుకు బండి సంజయ్ అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
బండి సంజయ్ ను కరీంనగర్ లో అరెస్ట్ చేసి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాలరామారం తరలించారు. అక్కడి నుంచి హనుమకొండ కోర్టుకు తీసుకెళ్లారు. బండి సంజయ్ కి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈలోగా బీజేపీ లీగల్ సెల్ బండి సంజయ్ బెయిల్ పిటిషన్ వేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం హనుమకొండ కోర్టు బండి సంజయ్ కి బెయిల్ మంజూరు అయింది. అయితే బండి సంజయ్ అరెస్ట్ అనంతరం హనుమకొండ సీపీ ప్రెస్ మీట్ పెట్టారు.

10వ తరగతి హిందీ పేపర్ లీక్ విషయంలో బండి సంజయ్ ప్రశాంత్ అనే వ్యక్తితో కుట్ర చేశారని సీపీ తెలిపారు. బండి సంజయ్ ప్రశాంత్ తో చాట్ చేసినట్లు చెప్పారు. బండి సంజయ్ ఫోన్ ఇవ్వలేదని చెప్పారు. అయితే బండి సంజయ్ తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బండి సంజయ్ ఫిర్యాదు పై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..












Click it and Unblock the Notifications