భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ దీక్ష విరమణ..పార్టీ సూచన మేరకు నిమ్మరసం
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేస్తున్న నిరహర దీక్ష ను విరమించాడు. గత అయిదు రోజులుగా ఆయన నిమ్స్‌లో చేస్తున్న దీక్షను కేంద్ర హోం శాఖ సహయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం లక్ష్మణ్ కు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. అయిదు రోజులుగా దీక్ష చేస్తుండడంతో లక్ష్మణ్ ఆరోగ్యం క్షిణిస్తున్నందున పార్టీ కోర్ కమిటితో పాటు కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ ఆయనకు సూచించారు.

ఈనేపథ్యలంలోనే ఇంటర్ విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని మంత్రి సూచించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆత్మహత్య చేసుపాకోవడం దురదృష్టకరమని అని అన్నారు. కాగా బోర్డు తప్పిదాల నేపథ్యంలో సంబంధిత విద్యాశాఖ మంత్రితోపాటు ఇంటర్ బోర్డు కార్యదర్శిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications