రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ దూరం: ఫిరాయించిన సభ్యులపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో మూడు స్థానాలకు గాను నలుగురు బరిలో నిలిచారు.
ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులు, ఒకరు కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు. సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన వారి ఓట్లను పరిగణలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది.

ఈ మేరకు ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా, రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశముంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలిచేందుకు 30 ఓట్లు రావాల్సి ఉంది. టీఆర్ఎస్ సభ్యులతో పాటు, టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి చేరినవారు, మజ్లిస్ మద్దతుతో సులభంగా గెలవనుంది. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకుంది.












Click it and Unblock the Notifications