ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్: పోడురైతులకు మద్దతుగా బీజేపీ పోరాటం చేస్తుందన్న బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 12ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన బండి సంజయ్ ఆయా నియోజకవర్గాల పరిస్థితి, అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఏ విధంగా బిజెపి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. బండి సంజయ్ ప్రజా క్షేత్రంలో టీఆర్ఎస్ పట్ల ఉన్న విముఖతను ఓటు బ్యాంకుగా ఎలా మార్చుకోవాలో పార్టీ శ్రేణులతో చర్చించారు . ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ఎస్టీ నియోజకవర్గాలలో టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత: బండి సంజయ్

ఎస్టీ నియోజకవర్గాలలో టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత: బండి సంజయ్


గచ్చిబౌలిలోని హోటల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ సమన్వయకర్త సమావేశంలో మాట్లాడిన బీజేపీ తెలంగాణా రథ సారధి టిఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ నియోజకవర్గాలలో టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన వెల్లడించారు. ఎస్టీ నియోజక వర్గాల ప్రజల సంక్షేమం కోసం బిజెపి నాయకులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న బండి సంజయ్ పేర్కొన్నారు.

 పోడు రైతులను కేసీఆర్ మోసం చేశారు; బీజేపీ పోరాటం చేస్తుంది : బండి సంజయ్

పోడు రైతులను కేసీఆర్ మోసం చేశారు; బీజేపీ పోరాటం చేస్తుంది : బండి సంజయ్

పోడు రైతులకు మద్దతుగా బీజేపీ పోరాటం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పోడు రైతులకు భూముల పట్టాలు ఇస్తానని చెప్పి ఇచ్చారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 12 ఎస్టీ నియోజకవర్గాలలో రాబోయే ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో ఉన్న మొత్తం 12 ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు కృషి చేయాలని అందుకు కార్యాచరణ రూపొందించినట్టు బండి సంజయ్ పేర్కొన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు చూస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. దీనిని పార్టీకి అనుకూలంగా మలుచుకుని సరైన కార్యాచరణతో ముందుకు సాగాలని బండి సంజయ్ దిశా నిర్దేశం చేశారు. ఎస్టీ నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించాలని ఎస్టీ నియోజకవర్గాలలో పార్టీ బలోపేతంపై బిజెపి నేతలు కృషిచేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర నాయకులు ప్రజాక్షేత్రంలో దూసుకు వెళ్లాలని, జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి అండగా ఉంటుందని బండి సంజయ్ వెల్లడించారు. గుర్రంపొడులో ఎస్టీ మోర్చ నేతలపై లాఠీచార్జి చేశారన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Recommended Video

    BJP Telangana Action Plan To Gain SC Constituencies | Oneindia Telugu
    బీజేపీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై బండి సంజయ్ చర్చ

    బీజేపీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై బండి సంజయ్ చర్చ

    రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించిన బండి సంజయ్ నేతలతో అనేక విషయాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.


    ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. గిరిజన, ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ చేయాలని చెప్పిన బండి సంజయ్ ప్రజా క్షేత్రంలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+