మజ్లిస్ తో కాంగ్రెస్ స్నేహం - తాజా ఎంపిక వెనుక...!!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన రెండు రోజులకే కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది. నూతన అసెంబ్లీ సమావేశమైంది. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎంపిక పైన బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలనే నిబంధనలు ఉన్నా..అక్బర్ కు ప్రొటెం స్పీకర్ గా అవకాశం ఇవ్వటం ద్వారా ప్రభుత్వాన్ని కాపాడుకొనే వ్యూహాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో ఒప్పందం చేసుకుంటుందనే విమర్శలు మొదలయ్యాయి.

తెలంగాణ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యేల్లో అందరి కంటే కేసీఆర్ సీనియర్. ఆ తరువాత హరీష్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్లుగా ఉన్నారు. అయితే , వారిని కాదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ రోజు సమావేశమైన అసెంబ్లీలో అక్బరుద్దీన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఇదే అంశం పైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

BJP Telangana Chief kishan Reddy allegates Congress to tie up with MIM to save the Govt

కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శించారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలన్నారు.అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటారని.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు బీజేపీరాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శించారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలన్నారు. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించి కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను కాలరాసిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

BJP Telangana Chief kishan Reddy allegates Congress to tie up with MIM to save the Govt

అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించి కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను కాలరాసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. సీనియర్ సభ్యుడి ఆధ్వర్యంలోనే రెగ్యులర్ స్పీకర్‌ను ఎన్నో కోవాలన్నారు. స్పీకర్ ఎన్నికను నిలిపివేయాలని గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. మజ్లిస్ పార్టీతో ఒప్పందం మేరకే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేశారన్నారు. తుమ్మినా.. దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ మజ్లిస్‌తో అంటకాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+